Published : 07/03/2021 13:32 IST

మయన్మార్‌లో ఆగని హింస

అటు ఆందోళనలు.. ఇటు అణచివేతలు

యాంగూన్‌: మయన్మార్‌లో సైనిక ప్రభుత్వం ఎంతగా హింసకు పాల్పడుతున్నా.. ప్రజాందోళనలు మాత్రం ఆగడం లేదు. ప్రజాస్వామ్య పాలన పునరుద్ధరణకు డిమాండ్‌ చేస్తూ ఆందోళనకారులు శనివారం కూడా పెద్దఎత్తున వీధుల్లోకి వచ్చారు. దీంతో భద్రతా దళాలు మరోసారి బలప్రయోగం చేశాయి. మయన్మార్‌లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రజలపై భద్రత దళాలు హింసకు పాల్పడుతుండటంతో ఇంతవరకు 50 మందికి పైగా మృతి చెందగా ఎంతోమంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో మయన్మార్‌లో సైనిక ప్రభుత్వం సాగిస్తున్న హింసను అరికట్టాలంటూ ఐక్యరాజ్యసమితిలో ఆ దేశ ప్రత్యేక రాయబారి భద్రత మండలిని కోరిన మరుసటి రోజే మరోసారి పోలీసులు అణచివేత చర్యలకు దిగారు. దేశంలో అతిపెద్ద నగరమైన యాంగూన్‌తో పాటు, మాండలే, మైత్కియినా, మైయిక్, దవేయి తదితర ప్రాంతాల్లో శనివారం ప్రజలు ఆందోళనకు దిగడంతో వారిపైకి భద్రత దళాలు ‘అచేతనావస్థలో ఉంచే గ్రనేడ్లు’ విసిరాయి. బాష్పవాయు ప్రయోగం చేశాయి. కాగా మయన్మార్‌లోని రెడ్‌క్రాస్‌ వాలంటీర్లు, ఆరోగ్య కార్యకర్తలకు తక్షణం రక్షణ కల్పించాల్సిందిగా రెడ్‌క్రాస్, రెడ్‌ క్రిసెంట్‌ సొసైటీల అంతర్జాతీయ సమాఖ్య కోరింది. క్షతగాత్రులకు మానవత్వంతో, నిష్పాక్షికంగా సేవలందించిన రెడ్‌క్రాస్‌ వాలంటీర్లు గాయపడటం విచారకరమని పేర్కొంటూ.. వారిని లక్ష్యంగా చేసుకోవద్దని సమాఖ్య కోరింది. 

 ‘ఆ 8 మందిని అప్పగించండి..’
ఐజ్వాల్‌: మయన్మార్‌ నుంచి తప్పించుకుని వచ్చి మిజోరామ్‌లో తలదాచుకుంటున్న 8 మంది పోలీసులను వెంటనే అప్పగించాలని ఆ దేశం కోరింది. ఈమేరకు చాంపాయ్‌ జిల్లా డిప్యూటీ కమిషనర్‌కు మయన్మార్‌ అధికారి లేఖ రాశారు. మయన్మార్‌తో 510 కి.మీ.ల మేర మిజోరామ్‌కు సరిహద్దు ఉంది. ఈమేరకు ఇటీవల ఆ 8 మంది తమ దేశం నుంచి పారిపోయి వచ్చారని, వారిని నిర్బంధించి తమకు అప్పగించాలని లేఖలో పేర్కొన్నారు. కాగా శుక్రవారం మయన్మార్‌ నుంచి 16 మంది వచ్చారని, వారిలో 11 మంది తాము పోలీసులమని చెప్పినట్లు మిజోరామ్‌ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మొత్తం పరిస్థితిని కేంద్ర హోంశాఖకు నివేదించామని.. అక్కడి నుంచి వచ్చే మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు చేపడతామని తెలిపారు. 

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని