Omicron: ఆస్ట్రేలియాలో కొత్త వేరియంట్‌ కలకలం.. ఇద్దరికి ఒమిక్రాన్‌ పాజిటివ్‌

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌.. ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ రకం వైరస్‌ దక్షిణాఫ్రికా మొదలు బోట్స్‌వానా, ఇజ్రాయెల్‌, హాంకాంగ్‌ తదితర దేశాలకు విస్తరించింది. దీంతో ఆయా దేశాలు అప్రమత్తమై రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నాయి...

Published : 28 Nov 2021 14:23 IST

కాన్‌బెర్రా: కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌.. ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ రకం వైరస్‌ దక్షిణాఫ్రికా మొదలు బోట్స్‌వానా, ఇజ్రాయెల్‌, హాంకాంగ్‌ తదితర దేశాలకు విస్తరించింది. దీంతో ఆయా దేశాలు అప్రమత్తమై రాకపోకలపై ఆంక్షలు విధించాయి. ఒమిక్రాన్‌ కేసులు వెలుగుచూసిన దేశాల నుంచి వస్తున్నవారికి పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఇదే క్రమంలో తాజాగా ఆస్ట్రేలియాలోనూ ఈ వేరియంట్‌కు సంబంధించిన రెండు కేసులు బయటపడటం స్థానికంగా కలవరానికి దారితీసింది. 

దోహా మీదుగా సిడ్నీకి..

దక్షిణాఫ్రికా నుంచి దోహా మీదుగా శనివారం రాత్రి సిడ్నీ చేరుకున్న ప్రయాణికులకు కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా.. ఇద్దరికి పాజిటివ్‌గా తేలింది. వెంటనే వారి నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌కు పంపగా, ఒమిక్రాన్‌ వేరియంట్‌ బారిన పడినట్లు తేలింది. ఇద్దరిలో లక్షణాలు లేవిని, రెండు డోసుల టీకా పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. వారిని ఐసొలేషన్‌కు తరలించినట్లు చెప్పారు. దక్షిణాఫ్రికా నుంచి మొత్తం 14 మంది రాగ.. మిగితా 12 మందికి నెగెటివ్‌గా తేలినట్లు చెప్పారు. ముందుజాగ్రత్త చర్యగా వారినీ క్వారంటైన్‌ చేసినట్లు వెల్లడించారు. మరోవైపు దాదాపు 260 మంది ప్రయాణికులు, సిబ్బందిని క్లోజ్డ్‌ కాంటాక్ట్స్‌గా గుర్తించి, ఐసొలేషన్‌లో ఉండాలని ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని