2020లో  రైళ్లలో జరిగిన నేరాలెన్నంటే?

గతేడాది రైళ్లలో చోటుచేసుకున్న నేర ఘటనలపై కేంద్రం ప్రకటన చేసింది. 2020లో....

Published : 11 Feb 2021 01:34 IST

దిల్లీ: గతేడాది రైళ్లలో చోటుచేసుకున్న నేర ఘటనలపై కేంద్రం ప్రకటన చేసింది. 2020లో 17,125 కేసులు నమోదైనట్టు రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ వెల్లడించారు. రైళ్లలో జరిగిన నేర ఘటనలపై ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు లోక్‌సభలో ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2018లో 55,780 కేసులు నమోదు కాగా..  2019లో 54,552 ఎఫ్‌ఐఆర్‌లు దాఖలైనట్టు ఆయన తెలిపారు. రైల్వే పోలీసింగ్ రాష్ట్రాల పరిధిలోని అంశమన్నారు. రైళ్లలో నేరాల నియంత్రణ, కేసుల నమోదు, వాటి దర్యాప్తు, శాంతిభద్రతల నిర్వహణ తదితర అంశాలన్నీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాల చట్టబద్ధమైన బాధ్యత అని తెలిపారు. రైళ్లలోని 2,931 కోచ్‌లలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశామని, 668 రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల భద్రతను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో గతేడాది రైళ్ల రాకపోకలు నిలిచిపోయినప్పటికీ కొన్ని ప్రత్యేక రైళ్లను మాత్రమే కేంద్రం అనుమతించిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి..

బలగాల్ని వెనక్కి తీసుకుంటున్నాం: చైనా

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని