థర్డ్‌ వేవ్‌ ముప్పు.. చెక్‌లిస్ట్‌ సిద్ధం చేసుకోండి!

కరోనా వైరస్‌ విజృంభణతో ఇప్పటికే సతమతమవుతున్న భారత్‌కు మూడో అల (థర్డ్‌ వేవ్‌) ముప్పు పొంచి ఉందన్న నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌......

Published : 02 Jun 2021 18:28 IST

పారిశ్రామిక సంఘాలతో సమీక్షలో పీయూష్‌ గోయల్‌

దిల్లీ: కరోనా వైరస్‌ విజృంభణతో ఇప్పటికే సతమతమవుతున్న భారత్‌కు మూడో అల (థర్డ్‌ వేవ్‌) ముప్పు పొంచి ఉందన్న నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ పారిశ్రామిక వర్గాలను అప్రమత్తం చేశారు. దీన్ని ఎదుర్కొనేందుకు సమగ్రమైన ప్రొటోకాల్‌ చెక్‌లిస్ట్‌ను సిద్ధం చేసుకోవాలని కోరారు. అలాగే, థర్డ్‌వేవ్‌లో వైరస్‌ ప్రభావానికి గురయ్యే చిన్నారులకు సాయం చేయాలని పారిశ్రామిక సంఘాలకు సూచించారు. 

కరోనాతో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లపై సన్నద్ధతకు సంబంధించి పారిశ్రామిక సంఘాలతో బుధవారం ఆయన సమీక్షించారు. ఇటీవల కరోనా కేసులు భారీగా పెరగడంతో పారిశ్రామిక ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడిందని పీయూష్‌ గోయల్‌ అన్నారు. కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌లు, ఆక్సిజన్‌ కొరత, కార్మికులు స్వస్థలాలకు వెళ్లిపోవడం, మరికొందరు కరోనా బారినపడటంతో నష్టం జరిగినట్టు తెలిపారు. గత అనుభవాలను పాఠాలుగా తీసుకొని భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనాలని సూచించారు. ఈ సమావేశంలో సీఐఐ, పీహెచ్‌డీ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ ప్రతినిధులతో పాటు పలువురు పాల్గొన్నట్టు కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. వారంతా కరోనాతో ఎదురైన అనుభవాలను పంచుకున్నారని, ఒకవేళ థర్డ్‌వేవ్‌ వస్తే ఎదుర్కొనేందుకు సన్నద్ధతపైన చర్చించినట్టు ఓ ప్రకటనలో తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని