దేశీ యాప్‌ ‘కూ’లో పీయూష్‌ గోయల్‌

విదేశీ సోషల్‌మీడియా వేదిక ట్విటర్‌కు పోటీగా తీసుకొచ్చిన యాప్‌ ‘కూ’లో కేంద్ర రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ చేరారు. ఈ విషయాన్ని గోయల్‌ తన ట్విటర్‌ ఖాతా ద్వారా వెల్లడించారు. భారతీయ

Published : 10 Feb 2021 01:18 IST

దిల్లీ: విదేశీ సోషల్‌మీడియా వేదిక ట్విటర్‌కు పోటీగా తీసుకొచ్చిన యాప్‌ ‘కూ’లో కేంద్ర రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ చేరారు. ఈ విషయాన్ని గోయల్‌ తన ట్విటర్‌ ఖాతా ద్వారా వెల్లడించారు. భారతీయ మైక్రోబ్లాగింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ‘కూ’లో తాను ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు. తన శాఖలకు సంబంధించి అప్‌డేట్లను ఎప్పటికప్పుడు ఈ యాప్‌లో తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. 

గతేడాది మార్చిలో విడుదల చేసిన ‘కూ’ యాప్‌.. ఆత్మనిర్భర్‌ సోషల్‌ మీడియా విభాగంలో ఉత్తమ దేశీ యాప్‌గా అవార్డును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన మన్‌కీబాత్‌లోనూ ఈ యాప్‌ గురించి ప్రస్తావించారు. ట్విటర్‌ తరహాలోనే ఇందులో దేశీయ భాషల్లో నెటిజన్లు తమ అభిప్రాయాలను వెల్లడింవచ్చు. ప్రస్తుతం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, ఒరియా, పంజాబీ, అసోమీ, బెంగాలీ, మరాఠీ, గుజరాతీ, హిందీ భాషల్లో ఈ యాప్‌ అందుబాటులో ఉంది.

ఇప్పటికే కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌, కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పకు ఈ యాప్‌లో ఖాతాలు ఉన్నాయి. వీరితో పాటు కేంద్ర ప్రభుత్వానికి చెందిన పలు విభాగాలు, ఇండియా పోస్ట్‌; మై గవర్నమెంట్‌ ఇండియా, డిజిటిల్‌ ఇండియాలు కూడా ‘కూ’ యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. కాగా.. రైతుల ఆందోళన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, ట్విటర్‌ మధ్య భేదాభిప్రాయాలు నెలకొన్న వేళ.. గోయల్‌ ‘కూ’ ఖాతా తెరవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇదీ చదవండి..

చాలా వస్తున్నాయ్‌.. వెయిట్‌ చేయండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని