Modi- Joe Biden Meeting: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో మోదీ తొలిసారి కీలక భేటీ
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. శ్వేతసౌధంలోని ఓవల్ ఆఫీస్‌లో ఇరువురు నేతలూ.....
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. శ్వేతసౌధంలోని ఓవల్ ఆఫీస్‌లో ఇరువురు నేతలూ సమావేశమయ్యారు. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికైన తర్వాత ఆయనతో మోదీ ద్వైపాక్షిక భేటీ కావడం ఇదే తొలిసారి. శ్వేతసౌధంలో మోదీకి ఘన స్వాగతం లభించింది. జో బైడెన్ ఆయన్ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. తొలిసారి జరిగిన ఈ ద్వైపాక్షిక భేటీలో కరోనాపై పోరాటం, వాతావరణ మార్పులు, ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారంపై కీలకంగా చర్చించారు. అలాగే, అఫ్గానిస్థాన్‌లో పరిస్థితులతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపైనా చర్చించినట్టు సమాచారం.
ఇదో సరికొత్త అధ్యాయం.. బైడెన్
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశాలైన భారత్-అమెరికా మధ్య సంబంధాలు మరింత బలోపేతం కావాలని అన్నారు. ఇరు దేశాల దృఢమైన బంధం కోసమే ఈ చర్చలని తెలిపారు. 40 లక్షల మంది ఇండో- అమెరికన్లు అగ్రరాజ్యాన్ని శక్తిమంతం చేస్తున్నారని మోదీతో అన్నారు. ఇరు దేశాల సబంధాల్లో ఈ భేటీ సరికొత్త అధ్యాయమని తెలిపారు. ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను భారత్-అమెరికా బంధం పరిష్కరిస్తుందని తాను విశ్వసిస్తున్నట్టు బైడెన్ మోదీతో అన్నారు.
వాణిజ్య భాగస్వామ్యం బలోపేతం కావాలి.. మోదీ
అనంతరం మోదీ మాట్లాడుతూ.. ఈ శతాబ్దం మూడో దశాబ్దం ప్రారంభంలో జరుగుతున్న ఈ దైపాక్షిక సమావేశం ఎంతో కీలకమైందన్నారు. ఈ దశాబ్దం రూపుదిద్దుకోవడంలో అమెరికా నాయకత్వం కచ్చితంగా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. భారత్-అమెరికా వాణిజ్యం భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. సాంకేతికత ఓ ఛోదక శక్తిగా మారుతోందన్న ప్రధాని.. ప్రపంచ శ్రేయస్సు కోసం సాంకేతికతను వాడేలా మన ప్రతిభను వినియోగించుకోవాలన్నారు. బైడెన్‌తో ఈ సమావేశం ఎంతో కీలకమైందని.. ఇరు దేశాలకు ఈ సమావేశం చాలా ముఖ్యమైందన్నారు. భారత్- అమెరికా ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉన్నాయన్నారు.
మూడు రోజుల పర్యటనకు అమెరికా వెళ్లిన మోదీ.. బిజీబిజీగా గడుపుతున్నారు. మొదటి రోజు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, ఆస్ట్రేలియా, జపాన్ ప్రధానులతో మోదీ సమావేశమయ్యారు. ప్రముఖ సంస్థల సీఈఓలతోనూ ఆయన చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఈ రాత్రికి జరగబోయే క్వాడ్ సమ్మిట్‌లో మోదీ పాల్గొననున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత
Erode MP Ganeshamurthi Suicide: టికెట్ రాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ.. చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. -
కసబ్‌ను పట్టుకున్న సదానంద్ దాతెకు ఎన్ఐఏ పగ్గాలు
‘ఉగ్రవాద వ్యతిరేక దళం’ అధిపతిగా ఉన్న సదానంద్ వసంత్ దాతెను ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్‌గా నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. -
ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ నేడు చెబుతారు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తన భర్త, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఆయన సతీమణి సునీత బుధవారం సంచలన ప్రకటన చేశారు. -
నాలుగు చిలుకలకు రూ.444 టికెట్!
స్వేచ్ఛగా విహరించాల్సిన చిలుకలు బస్సులో ప్రయాణించిన కారణంగా వందల రూపాయలతో టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. -
రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది రాజకీయ ప్రతీకారమే
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని దిల్లీ మంత్రి ఆతిశీ పేర్కొన్నారు. -
కేరళ సీఎం కుమార్తెపై ఈడీ కేసు నమోదు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. -
‘ఎయిరిండియా’ రెక్కలను ఢీకొన్న ఇండిగో
చెన్నై వెళ్లేందుకు సిద్ధమై రన్‌వే క్లియరెన్సు కోసం ఆగి ఉన్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం రెక్కలను దర్భంగా (బిహార్)కు బయలుదేరుతున్న ఇండిగో ఎయిర్‌క్రాఫ్ట్ ఢీకొంది. -
చివరి ఓటరునూ చేరుకోవాలని!
దేశంలోని ప్రతి ఓటరూ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం భగీరథ ప్రయత్నమే చేస్తుంది. ఓటర్లు ఎక్కడ ఉన్నా వారి కోసం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. -
హుక్కా బార్లో సోదాలు.. పోలీసుల అదుపులో బిగ్‌బాస్ విజేత మునావర్ ఫారూకీ
ప్రముఖ స్టాండప్ కమెడియన్, హిందీ బిగ్‌బాస్-17 విజేత మునావర్ ఫారూకీ మరోసారి వివాదంలో నిలిచారు. -
ఇలా ప్రవేశం.. అలా ఆమోదం
దేశానికి, ప్రజలకు అవసరమయ్యే శాసనాలు సమర్థవంతంగా, లోపరహితంగా ఉండటం ఎంతైనా అవసరం. అంతటి ప్రాధాన్యం ఉంది కనుకే చట్టసభల్లో వాటిపై విస్తృతమైన చర్చలు, సంప్రదింపులు జరుపుతుంటారు. -
రూ.245 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ముంబయి పోలీసులు భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. -
మహువా, హీరానందానీలకు మళ్లీ ఈడీ సమన్లు
విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో టీఎంసీ నేత మహువా మొయిత్రా, దుబాయ్ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీలకు బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మళ్లీ సమన్లు జారీ చేసింది. -
ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో ప్రవర్తన మారకూడదు
ప్రజల ప్రవర్తనలో మార్పు ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో రాకూడదని, అది మనసులో నుంచి వివేకంతో రావాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. -
మనీలాండరింగ్ పరిధిలోకి రాని నేరానికి ఆ చట్టాన్ని వర్తింపజేయలేం
ఒక వ్యక్తిపై మోపిన నేరపూరిత కుట్ర అభియోగాలు మనీలాండరింగ్ చట్టం పరిధిలోకి రానట్లయితే...సదరు నిందితుడిపై ‘ఐపీసీ సెక్షన్ 120బి’ని మోపి పీఎంఎల్ఏ కింద కేసు నమోదు చేయరాదని సర్వోన్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది. -
ఆసుపత్రి నుంచి సద్గురు డిశ్ఛార్జ్
ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆసుపత్రి నుంచి బుధవారం డిశ్ఛార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని ఈశా ఫౌండేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. -
డ్రగ్స్ జప్తు కేసులో మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్‌ను దోషిగా తేల్చిన కోర్టు
కస్టడీ మరణం కేసులో ఇప్పటికే జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్‌ను న్యాయస్థానం మరో నేరంలో దోషిగా నిర్ధారించింది. -
నేపాల్ మేయర్ కుమార్తె ఆచూకీ లభ్యం
గోవాలో రెండ్రోజుల క్రితం అదృశ్యమైన నేపాల్‌లోని ధన్‌గఢీ నగర మేయర్ కుమార్తె ఆర్తీ హమాల్(36) ఆచూకీ బుధవారం లభ్యమైంది. -
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన నిధులు తన వద్ద లేవని.. అందుకే పార్టీ ప్రతిపాదనను తిరస్కరించానని ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. -
26/11 హీరో సదానంద్ వసంత్ దాటేకు ఎన్ఐఏ పగ్గాలు
కేంద్ర దర్యాప్తు సంస్థ నూతన అధిపతిగా సదానంద్ వసంత్ దాటే నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. -
ఈ మూడు విషయాలే ఆరోగ్యకర జీవన రహస్యం.. డాక్టర్ ఫార్ములా షేర్ చేసిన హర్ష గోయెంకా
ఆరోగ్యకరమైన జీవనానికి ఏం చేయాలో ఓ డాక్టర్ చెబుతున్న సీక్రెట్ ఫార్ములా వీడియోను హర్ష గోయెంకా ఎక్స్‌లో షేర్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
-
మా బౌలర్ల తప్పేమీ లేదు.. హైదరాబాద్ బ్యాటర్లకు హ్యాట్సాఫ్: హార్దిక్ పాండ్య
-
నన్ను తిట్టుకోవద్దు.. ఈసారి నేను ఎలాంటి లీకులు ఇవ్వలేను: దిల్‌రాజు
-
కొనసాగుతున్న మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక
-
‘అత్యంత సంతోషకరమైన వ్యక్తి ఆమె’.. నెట్టింట వైరల్‌గా మారిన కావ్యా మారన్
-
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత