https://www.eenadu.net/eenadu_api/metadata.php?newsid=121234412&type=latestnewslatestnews
stdClass Object
(
    [response] => Array
        (
            [0] => stdClass Object
                (
                    [news_id] => 121234412
                    [news_title_telugu] => Audit Diwas  ‘కాగ్‌’ మరింత బలపడుతోంది..!
                    [news_title_english] => pm on 1st audit diwas
                    [news_short_description] => ‘‘అతి కొద్ది సంస్థలు మాత్రమే కాల క్రమంలో మెరుగుపడుతూ.. మరింత శక్తివంతం అవుతాయి.. చాలా సంస్థలు మాత్రం ప్రాధాన్యం కోల్పోతాయి. కాగ్‌ మన వారసత్వం.. దానిని ప్రతి తరం గుర్తుపెట్టుకోవాలి’’

                    [news_tags_keywords] => 
                    [news_meta_keywords] => 
                    [news_createdon] => 2021-11-16 11:50:46
                    [news_thumbimage] => 
                    [news_pdfisactive] => 0
                    [news_title_prefix] => 
                )

        )

)
Audit Diwas  ‘కాగ్‌’ మరింత బలపడుతోంది.. | pm on 1st audit diwas

Audit Diwas  ‘కాగ్‌’ మరింత బలపడుతోంది..!

‘‘అతి కొద్ది సంస్థలు మాత్రమే కాల క్రమంలో మెరుగుపడుతూ.. మరింత శక్తివంతం అవుతాయి.. చాలా సంస్థలు మాత్రం ప్రాధాన్యం కోల్పోతాయి. కాగ్‌ మన వారసత్వం.. దానిని ప్రతి తరం గుర్తుపెట్టుకోవాలి’’

Updated : 16 Nov 2021 14:03 IST

* తొలి ఆడిట్‌ దినోత్సవంలో ప్రధాని మోదీ

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘‘అతి కొద్ది సంస్థలు మాత్రమే కాలక్రమంలో మెరుగుపడుతూ.. మరింత శక్తిమంతం అవుతాయి.. చాలా సంస్థలు మాత్రం ప్రాధాన్యం కోల్పోతాయి. కాగ్‌ మన వారసత్వం.. దానిని ప్రతి తరం గుర్తుపెట్టుకోవాలి’’ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దిల్లీలోని కాగ్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన తొలి ఆడిట్‌ దినోత్సవంలో ప్రధాని పాల్గొని ప్రసంగించారు. ‘‘ప్రభుత్వ పనితీరును విశ్లేషించే క్రమంలో కాగ్‌ బయటి సంస్థల మాదిరిగా విశ్లేషించడం కలిసొచ్చే అంశం. కాగ్‌ సూచనల ఆధారంగా వ్యవస్థీకృతమైన మార్పులు చేసుకొంటాం. దీనిని మేం పాలనకు సహకారంగా భావిస్తాం’’ అని మోదీ పేర్కొన్నారు. 

‘‘ఒకప్పుడు కాగ్‌ను భయంతో, అనుమానంతో చూసేవారు. కాగ్‌ వర్సెస్‌ ప్రభుత్వం అనే ఆలోచన విధానం అప్పట్లో ఉండేది. కాగ్‌ ప్రతి విషయంలో తప్పులు వెతుకుతుందని భావించేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. పాలనకు అదనపు విలువను జోడించే కీలక భాగంగా దానిని చూస్తున్నారు. ఒకప్పుడు దేశంలోని బ్యాంకుల్లో వివిధ పద్ధతులు వాడేవారు. ఫలితంగా మొండి బకాయిలు పెరిగాయి. వాటిని కప్పి పెట్టేందుకు పలు ప్రయత్నాలు చేసేవారు. కానీ, మేం వాస్తవ పరిస్థితులను ప్రజల ముందుకు ధైర్యంగా తీసుకొచ్చాం. మనం సమస్యను గుర్తించినప్పుడే దానికి పరిష్కారం కోసం ప్రయత్నిస్తాం’’ అని మోదీ అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో కాగ్‌ జి.సి.ముర్మ్‌ ప్రసంగిస్తూ.. ‘‘భారత ప్రభుత్వ చట్టం 1858 కింద బెంగాల్‌,మద్రాస్‌, బాంబే ప్రెసిడెన్సీల ఆడిట్‌ విభాగాలను 1860 నవంబర్‌ 6వ తేదీన విలీనం చేశారు. దీంతో తొలి ఆడిటర్‌ జనరల్‌ బాధ్యతలు చేపట్టారు. అందుకే ఈ  రోజును ఆడిట్‌ దినోత్సవంగా ఎంచుకొన్నాం’’ అని పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని