PM Modi: ‘ప్రజల ప్రయోజనాలే మాకు ముఖ్యం..’: పెట్రో ధరల తగ్గింపుపై మోదీ ట్వీట్‌

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గిస్తున్నట్టు కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో మోదీ ట్వీట్‌ చేశారు. .......

Published : 22 May 2022 02:06 IST

దిల్లీ: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గిస్తున్నట్టు కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో మోదీ ట్వీట్‌ చేశారు. తమకెప్పుడూ ప్రజల సంక్షేమమే ముఖ్యమని అని పేర్కొన్నారు. ఈరోజు పెట్రో ధరల తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాలు వివిధ రంగాలపై సానుకూల ప్రభావం చూపుతాయన్నారు. ప్రజలకు ఊరటనివ్వడంతో పాటు వారి జీవితాన్ని మరింత సులభతరం చేస్తాయని ట్వీటర్‌లో పేర్కొన్నారు. పీఎం ఉజ్వల యోజన కోట్ల మంది భారతీయులకు, ముఖ్యంగా మహిళలకు ఉపయోగపడుతోందన్న ఆయన.. సబ్సిడీ ఇస్తూ నేడు తీసుకున్న నిర్ణయం కుటుంబ బడ్జెట్‌లను సులభతరం చేస్తుందన్నారు. 

దేశంలో ద్రవ్యోల్బణం, పెట్రో ధరల పెరుగుదలతో సతమతమవుతున్న ప్రజలకు ఊరటనిస్తూ కేంద్రం చమురు, గ్యాస్‌పై పన్నులు తగ్గించిన విషయం తెలిసిందే. లీటరు పెట్రోల్‌పై రూ.8లు, డీజిల్‌పై రూ.6 చొప్పున తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజా తగ్గింపుతో లీటర్‌ పెట్రోల్‌పై రూ.9.50లు, డీజిల్‌పై రూ.7 తగ్గే అవకాశం ఉంది. పీఎం ఉజ్వల్‌ యోజన పథకం కింద 9కోట్ల మంది లబ్ధిదారులకు ఒక్కో సిలిండర్‌పై రూ.200 రాయితీతో ఊరట కల్పిస్తున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని