చిమ్మచీకట్లో పాక్‌..

దేశ రాజధాని ఇస్లామాబాద్‌తో సహా పాకిస్తాన్‌ అంధకారంలో మునిగిపోయింది.

Updated : 10 Jan 2021 15:53 IST

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లో పవర్‌గ్రిడ్‌ కుప్పకూలింది. రాజధాని ఇస్లామాబాద్‌తో సహా దాదాపు దేశం మొత్తం అంధకారంలో మునిగిపోయింది. స్థానిక కాలమానం ప్రకారం శనివారం రాత్రి 11:41 నిముషాలకు దక్షిణ పాకిస్థాన్‌లోని గ్రిడ్‌లో తలెత్తిన సాంకేతిక లోపం కారణగా ఈ పరిస్థితి నెలకొన్నట్లు ప్రాథమిక విచారణ నివేదిక చెబుతోంది.

ఈ సాంకేతిక అవరోధం ప్రభావంతో దేశ వ్యాప్తంగా ఉన్న విద్యుత్‌ ప్లాంట్లు వరుసగా మూతపడ్డాయి. ఫలితంగా దేశవ్యాప్తంగా 21 కోట్ల మంది చీకట్లో మగ్గుతున్నారు. పాక్‌ రాజధాని ఇస్లామాబాద్‌, ఆర్థిక రాజధాని కరాచీ, రెండో అదిపెద్ద నగరం లాహోర్‌తో సహా పలు పట్టణాలు చీకటిమయమయ్యాయి.

పరిస్థితిని చక్కదిద్దేందుకు అవసరమైన మరమ్మతులు చేపట్టామని.. దేశంలోకి కొన్ని ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించామని పాక్‌ విద్యుత్తు శాఖ మంత్రి మంత్రి ఒమర్‌ అయూబ్‌ ఖాన్‌ అన్నారు. కరెంటు సరఫరాను సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు సహాయక బృందాలు కృషి చేస్తున్నాయని ఆయన వెల్లడించారు.

ఇవీ చదవండి..

ఇండోనేషియా: నీటిలో శరీర భాగాలు, విమాన శకలాలు

భారత్‌కు పట్టుబడ్డ చైనా సైనికుడు


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని