Ayodhya: 29న అయోధ్యకు రాష్ట్రపతి.. మళ్లీ రైల్లో ప్రయాణం

భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈ నెల 29న అయోధ్యను సందర్శించనున్నారు. ఈ క్రమంలో ఆయన లఖ్‌నవూ నుంచి అయోధ్యకు ప్రత్యేక రైల్లో ప్రయాణించనున్నారు. అధికార వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ప్రస్తుతం అక్కడ రామ మందిర నిర్మాణం వేగంగా సాగుతోన్న విషయం తెలిసిందే...

Published : 24 Aug 2021 23:05 IST

దిల్లీ: భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈ నెల 29న అయోధ్యను సందర్శించనున్నారు. ఈ క్రమంలో ఆయన లఖ్‌నవూ నుంచి అయోధ్యకు ప్రత్యేక రైల్లో ప్రయాణించనున్నారు. అధికార వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ప్రస్తుతం అక్కడ రామ మందిర నిర్మాణం వేగంగా సాగుతోన్న విషయం తెలిసిందే. ఈ పనులను రాష్ట్రపతి పరిశీలించనున్నట్లు తెలిసింది. ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌, గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌ ఆయన వెంట ఉండే అవకాశం ఉంది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ ప్రతినిధులు ఆలయ నిర్మాణానికి సంబంధించిన పూర్తి వివరాలు వారికి వెల్లడించనున్నారు. ఈ సందర్భంగా అక్కడే కొలువుదీరిన రామ్‌లల్లాను దర్శించుకోనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అధికారులు తగు ఏర్పాట్లు చేస్తున్నారు. రైల్వేశాఖ కూడా భద్రతాపర చర్యలు తీసుకుంటోంది. అయోధ్యను సందర్శించనున్న మొదటి రాష్ట్రపతి కోవింద్‌ కానుండటం గమనార్హం. ఈ హోదాలో రైల్లో ప్రయాణించడం ఆయనకు ఇది రెండోసారి. ఇదివరకు దిల్లీ నుంచి కాన్పూర్‌కు ప్రయాణించిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని