రైల్వేస్టేషన్లలో రుసుము ఆధారిత వైఫై సేవలు

దేశవ్యాప్తంగా 4000 రైల్వేస్టేషన్లలో రుసుము ఆధారిత వైఫై సేవలను రైల్‌టెల్‌ ప్రారంభించింది. ఆయా రైల్వేస్టేషన్లలో మరింత వేగవంతమైన ఇంటర్నెట్‌ సేవలను అందించేందుకు ఈ సేవలను ప్రారంభించామని రైల్‌టెల్‌ పేర్కొంది....

Published : 05 Mar 2021 12:31 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా 4000 రైల్వేస్టేషన్లలో రుసుము ఆధారిత వైఫై సేవలను రైల్‌టెల్‌ ప్రారంభించింది. ఆయా రైల్వేస్టేషన్లలో మరింత వేగవంతమైన ఇంటర్నెట్‌ సేవలను అందించేందుకు ఈ సేవలను ప్రారంభించామని రైల్‌టెల్‌ పేర్కొంది. ఇప్పటికే 5950 రైల్వేస్టేషన్లలో 1 ఎంబీపీఎస్‌ వేగంతో 30 నిమిషాల వరకు ప్రయాణికులకు ఉచిత వైఫై అందిస్తున్నామని తెలిపింది. అయితే ఇంటర్నెట్‌ వేగాన్ని 34 ఎంబీపీఎస్‌కు పెంచి పరిమిత రుసుముతో సేవలందిస్తామని ప్రకటించింది. ఒక్కరోజు పరిమితితో రూ.10కి 5జీబీ డేటాను అందిస్తామని రైల్‌టెల్‌ వెల్లడించింది. రూ.20కి 10 జీబీ ఇస్తూ 5 రోజుల కాలపరిమితి ఇచ్చింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని