Indian Railway: పర్యాటకరంగ అభివృద్ధికి ‘భారత్ గౌరవ్’ రైళ్లు..!

దేశంలోని పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే దిశగా.. భారతీయ రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్రయాణికుల కోసం ప్యాసింజర్ సర్వీసులు, సరకు రవాణా కోసం గూడ్సు సర్వీసులను

Published : 23 Nov 2021 20:13 IST

దిల్లీ: దేశంలోని పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే దిశగా.. భారతీయ రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్రయాణికుల కోసం ప్యాసింజర్ సర్వీసులు, సరకు రవాణా కోసం గూడ్సు సర్వీసులను నడుపుతున్న రైల్వేశాఖ.. పర్యాటక రంగ అభివృద్ధి కోసం ‘భారత్ గౌరవ్’ పేరిట 190 రైళ్లను నడపనుంది. ఈ మేరకు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ రైలు సర్వీసులను ఐఆర్‌సీటీసీ సహా ప్రైవేటు రంగంలోనూ నడపనున్నట్లు తెలిపారు. భారత్ గౌరవ్ రైలు సర్వీసుల కోసం 3,033 కోచ్‌లు.. లేదా 190 రైళ్లను గుర్తించినట్లు వివరించారు. దేశ సాంస్కృతిక, వారసత్వ సంపద గొప్పతనాన్ని చాటేందుకు భారత్ గౌరవ్ రైలు సర్వీసులను ప్రారంభించనున్నట్లు చెప్పారు. వీటి కోసం మంగళవారం నుంచే దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఈ రైలు సర్వీసుల్లో ఛార్జీలను.. సంబంధిత టూర్ ఆపరేటర్లు నిర్ణయిస్తారని వెల్లడించారు. భారత్ గౌరవ్ రైళ్ల కోసం కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, రాజస్థాన్‌ రాష్ట్రాలు ఆసక్తి కనబరిచినట్లు వివరించారు.

Read latest National - International News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని