గాంధీ జయంతి వరకు రైతు ఉద్యమం

ప్రస్తుతం దేశ రాజధాని సరిహద్దుల్లో జరుగుతున్న రైతుల నిరసన అక్టోబరు 2 వరకూ కొనసాగిస్తామని భారతీయ కిసాన్‌ యూనియన్‌ నాయకుడు రాకేశ్‌ టికాయిత్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం విలేకరుల సమావేశంలో ప్రకటించారు.

Updated : 07 Feb 2021 12:53 IST

వెల్లడించిన రైతు నాయకుడు రాకేశ్‌ టికాయిత్‌

దిల్లీ: ప్రస్తుతం దేశ రాజధాని సరిహద్దుల్లో జరుగుతున్న రైతుల నిరసన అక్టోబరు 2 వరకూ కొనసాగిస్తామని భారతీయ కిసాన్‌ యూనియన్‌ నాయకుడు రాకేశ్‌ టికాయిత్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ‘‘ మా డిమాండ్లు పరిష్కారమయ్యే వరకూ ఇంటికి వెళ్లేది లేదు. గాంధీ జయంతి వరకూ ఈ నిరసనల్ని కొనసాగిస్తాం. ప్రభుత్వం దిగొచ్చే వరకూ రైతులు పోరాడుతూనే ఉంటారు. వ్యాపారం చేసుకొనేందుకు మా పొలాల్ని ఇవ్వం. ’’ అని టికాయిత్‌ వెల్లడించారు. కేంద్రం నూతనంగా తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ-ఉత్తర్‌ప్రదేశ్‌ సరిహద్దుల్లో జరుగుతున్న నిరసనల్లో ఆయన కీలకపాత్ర పోషిస్తున్నారు.

చక్కా జామ్‌ను హింసాత్మకంగా మార్చేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారన్న సమాచారంతో తాము పాల్గొనట్లేదని టికాయిత్‌ శుక్రవారం ప్రకటించారు. దీంతో శనివారం జరిగిన చక్కా జామ్‌లో ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలు పాల్గొనలేదు. కానీ దిల్లీ సరిహద్దుల్లో జరిగే నిరసనలో ఈ రెండు రాష్ట్రాల రైతుల పాల్గొంటారని ఆయన తెలిపారు.

ఇవీ చదవండి,,

ఈ బ్యాంకుల్లో మీకు ఖాతా ఉందా?

భారత్‌ను ప్రశంసించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని