Sabarimala: శబరిమలకు వచ్చే చిన్నారులకు ఆర్టీ-పీసీఆర్‌ తప్పనిసరి కాదు

అయ్యప్ప స్వామి దర్శనార్థం శబరిమలకు వచ్చే చిన్నారులకు ఆర్టీ-పీసీఆర్ పరీక్ష తప్పనిసరి కాదని కేరళ ప్రభుత్వం స్పష్టంచేసింది.

Published : 27 Nov 2021 19:56 IST

తిరువనంతపురం: అయ్యప్పస్వామి దర్శనార్థం శబరిమలకు వచ్చే చిన్నారులకు ఆర్టీ-పీసీఆర్ పరీక్ష తప్పనిసరి కాదని కేరళ ప్రభుత్వం స్పష్టంచేసింది. చిన్నారుల దగ్గర శానిటైజర్లు, సబ్బులు ఉండేలా వారి వెంట వచ్చే పెద్దలు చూసుకోవాలని సూచించింది. భౌతిక దూరం పాటించాలని తాజాగా వెలువరించిన ఉత్తర్వుల్లో పేర్కొంది. నవంబర్‌ 16న ప్రారంభమైన శబరిమల యాత్రలో పాల్గొనే భక్తులు, సిబ్బంది రెండు టీకా డోసులు వేసుకోవడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. లేదంటే ఆర్టీ-పీసీఆర్‌ నెగటివ్‌ సర్టిఫికెట్‌ చూపాల్సి ఉంటుంది. మరోవైపు వర్షాలు, కరోనా నేపథ్యంలో గతేడాది మాదిరిగానే వర్చువల్​క్యూ పద్ధతిలో భక్తులను అనుమతిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని