
మాస్క్ ముఖ్యం అంటూ..
మాస్క్ పెట్టుకోనందుకు స్కాటిష్ ఫస్ట్మినిస్టర్కు తప్పని తిప్పలు
ఎడిన్బర్గ్: మాస్క్ ధరించకుండా స్కాట్లాండ్ ఫస్ట్ మినిస్టర్ నికోలా స్టర్జియన్ పబ్‌లో మహిళలతో మాట్లాడుతున్న ఫొటో ఒకటి బుధవారం స్కాట్లాండ్కు చెందిన మీడియా సంస్థ ప్రచురించింది. కొవిడ్ నిబంధనలు పాటించకుండా, మాస్క్‌ను పక్కన పెట్టేయడంపై ఆమెపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. దాంతో కీలక పదవిలో ఉన్న ఆమె ప్రజలకు క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది. ‘గత శుక్రవారం అంత్యక్రియలకు హాజరైన క్రమంలో కొద్దిసేపు మాస్క్‌ను పక్కన పెట్టాను. అది చాలా తెలివితక్కువ పని. నన్ను క్షమించండి. నేను ప్రతి రోజు మాస్క్ ప్రాముఖ్యంపై మాట్లాడుతున్నాను. సాకులు చెప్పదల్చుకోలేదు. తప్పు చేశాను. నన్ను క్షమించండి’ అని ఓ ప్రకటనలో ప్రజలను అభ్యర్థించారు.
స్కాట్లాండ్లోని చట్టం ప్రకారం... పబ్‌లు, రెస్టారెంట్లతో సహా ఇతర ఇండోర్ ప్రాంతాల్లో ప్రజలు తప్పకుండా మాస్కులు ధరించాలి. మరో విషయం ఏంటంటే..మంగళవారం నికోలా పార్లమెంట్లో మాస్కుల ప్రాముఖ్యం గురించి మాట్లాడారు. ఆ మరునాడే ఆ ఫొటో ప్రచురితమైంది. ఈ వ్యవహారంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. నియమాలు అందరికి ఒకటే అని కొందరు విమర్శించగా.. మనుషులన్నాక తప్పులు జరుగుతుంటాయంటూ మరికొందరు మద్దతిచ్చారు.
ఇవీ చదవండి: