ఆ నలుగురిపై దేశద్రోహం కేసు?

హాథ్రస్‌ బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్న నలుగురిపై ఉగ్రవాద నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం. ఎఫ్‌ఐఆర్‌లో వీరిపై దేశద్రోహం అభియోగాలు మోపినట్లు తెలుస్తోంది..........

Published : 08 Oct 2020 01:59 IST

లఖ్‌నవూ: హాథ్రస్‌ బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తుండగా పోలీసులు మథురలో అదుపులోకి తీసుకున్న నలుగురిపై ఉగ్రవాద నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఎఫ్‌ఐఆర్‌లో వీరిపై దేశద్రోహం అభియోగాలు మోపినట్లు తెలుస్తోంది. దీనిపై యూపీ పోలీసుల నుంచి ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. అరెస్టయిన వారిలో కేరళకు చెందిన ఓ జర్నలిస్టు కూడా ఉన్న విషయం తెలిసిందే. వీరందరికీ ‘పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా’(పీఎఫ్‌ఐ) అనే సంస్థతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పౌరసత్వ సవరణ చట్టాని(సీఏఏ)కి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలకు ఈ సంస్థే నిధులు సమకూర్చిందన్న ఆరోపణలు ఉన్నాయి. దీన్ని నిషేధించాలని గతంలోనే ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.

ఇదీ చదవండి..
హాథ్రస్‌ ఆసరాగా సంఘవిద్రోహ కార్యకలాపాలు?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని