Shah Rukh Khan: ఆర్థర్‌ రోడ్‌ జైలుకు షారుక్‌ఖాన్‌.. ఆర్యన్‌కు షూరిటీ ఇచ్చిన జూహీచావ్లా

క్రూజ్‌ నౌకలో డ్రగ్స్‌ కేసులో బాలీవుడ్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌కు బెయిల్‌ లభించడంతో మరికొద్ది గంటల్లో అతడు జైలు నుంచి విడుదల కానున్నాడు.

Published : 29 Oct 2021 16:59 IST

ముంబయి: క్రూజ్‌ నౌక డ్రగ్స్‌ కేసులో బాలీవుడ్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌కు బెయిల్‌ లభించడంతో మరికొద్ది గంటల్లో అతడు జైలు నుంచి విడుదల కానున్నాడు. ఈ నేపథ్యంలో కుమారుడిని ఇంటికి తీసుకొచ్చేందుకు షారుక్‌ ఆర్థర్‌ రోడ్‌ జైలుకు బయల్దేరారు. అటు ఆర్యన్‌కు బెయిల్‌ రావడంతో షారుక్‌ అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. అతడు విడుదలై వస్తున్నాడని తెలిసి అభిమానులు పెద్ద ఎత్తున షారుక్‌ నివాసం మన్నత్‌కు చేరుకున్నారు.

జూహీ పూచీకత్తుతో..

డ్రగ్స్‌ కేసులో ఆర్యన్‌కు బాంబే హైకోర్టు నిన్న బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే దీనికి సంబంధించిన పూర్తిస్థాయి ఉత్తర్వులను న్యాయస్థానం నేడు జారీ చేసింది. మొత్తం 14 షరతులు విధిస్తూ ఆర్యన్‌కు బెయిల్‌ ఇచ్చింది. ఇందులో రూ.లక్ష బాండ్‌ ఒకటి. ఈ బాండ్‌కు ఒకరు లేదా ఇద్దరు వ్యక్తులు పూచీకత్తు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. దీంతో నటి జూహీ చావ్లా షూరిటీగా సంతకం చేశారు.

కోర్టు ఉత్తర్వులను తీసుకుని షారుక్‌ న్యాయ బృందం ఇప్పటికే జైలుకు బయల్దేరింది. అధికారిక లాంఛనాలన్నీ పూర్తయిన తర్వాత ఆర్యన్‌ను విడుదల చేసే అవకాశముంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని