6 అడుగుల ఎడంతో అధిక రక్షణ 

కరోనా వైరస్‌ గాలిలో ఎంత దూరం ప్రయాణిస్తుంది? వ్యక్తుల మధ్య ఎంత ఎడం ఉంటే మహమ్మారి బారిన పడే

Updated : 10 May 2021 11:27 IST

 మరోసారి స్పష్టంచేసిన సీడీసీ 

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ గాలిలో ఎంత దూరం ప్రయాణిస్తుంది? వ్యక్తుల మధ్య ఎంత ఎడం ఉంటే మహమ్మారి బారిన పడే ముప్పు తగ్గుతుంది? చాలామంది మెదళ్లను తొలిచేస్తున్న ఈ ప్రశ్నలకు అమెరికా వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం (సీడీసీ) తాజాగా మరోసారి సమాధానాలిచ్చింది. కొవిడ్‌ రోగి నుంచి 3-6 అడుగుల లోపు వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉంటుందని తేల్చింది. గాలి, వెలుతురు తగినంతగా లేని ప్రాంతాల్లోనైతే మహమ్మారి ముప్పు ఆరు అడుగుల కంటే ఎక్కువ దూరమే పొంచి ఉంటుందని నిర్ధారించింది. కాబట్టి వైరస్‌ నియంత్రణకు మాస్కుల ధారణ, భౌతిక దూరం పాటించడం వంటివి అత్యవసరమని తమ మార్గదర్శకాల్లో మరోసారి స్పష్టం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని