Rajasthan: ఆరుగురు అక్కాచెల్లెళ్లకు పెళ్లిచేసి.. గుర్రాలపై ఊరేగించి..!

పెళ్లి అంటేనే సందడి. మంచి సంబంధం చూసి ఘనంగా వివాహం చేయాలని వధూవరుల తల్లిదండ్రులు ప్రయత్నిస్తుంటారు. రాజస్థాన్‌కు చెందిన ఓ బస్సు డ్రైవర్ తన ఆరుగురు కుమార్తెలకు...

Updated : 27 Nov 2021 16:12 IST

జైపూర్‌: పెళ్లి అంటేనే సందడి. మంచి సంబంధం చూసి ఘనంగా వివాహం చేయాలని వధూవరుల తల్లిదండ్రులు ప్రయత్నిస్తుంటారు. రాజస్థాన్‌కు చెందిన ఓ బస్సు డ్రైవర్ తన ఆరుగురు కుమార్తెలకు ఒకేసారి పెళ్లి జరిపించి ఊర్లో అందరినీ ఆశ్చర్య పరిచాడు. ఇప్పుడీ వివాహం రాజస్థాన్‌లోనే కాకుండా దేశమంతటా చర్చనీయాంశమైంది. 

రాజస్థాన్‌లోని ఝున్‌ఝును జిల్లా ఖేతడిలో ఆరుగురు అక్కాచెల్లెళ్లకు ఒకేసారి వివాహం జరిగింది. స్కూల్‌ బస్సు డ్రైవర్‌గా పని చేస్తున్న రోహితాక్షన్‌కు ఏడుగురు కుమార్తెలు, ఓ కుమారుడు. వీరిలో పెళ్లీడు వచ్చిన ఆరుగురు కుమార్తెలకు వివాహం చేయాలని భావించాడు. ఆరుగురు కుమార్తెలకు ఇద్దరేసి చొప్పున అన్నదమ్ములు ఉన్న కుటుంబాలతో సంబంధం నిశ్చయించాడు. పెద్దకుమార్తె మీనా దుక్కేరా, మూడో కుమార్తె సీమాల వివాహం హరియాణాకు చెందిన నరేశ్‌, భైరూ సింగ్‌తో జరిగింది. రెండో కుమార్తె అంజు, నాలుగో కుమార్తె నిక్కీలు నీమ్‌ ఖాఠానాకు చెందిన ధర్మవీర్‌, విజయేంద్రలను మనువాడారు. యోగిత,సంగీతల వివాహం ఖుదానియాకు చెందిన ప్రదీప్‌, మోహిత్‌లతో జరిగింది.

ఆరుగురు కుమార్తెలకు డ్రైవర్‌ రోహితాక్షన్‌ అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించాడు. పెళ్లి బారాత్‌లో  పసుపు దుస్తులు ధరించి డీజేలో కుటుంబ సభ్యులతో కలిసి పెళ్లి కూతుళ్లు వేసిన స్టెప్పులు కట్టిపడేశాయి. ఖేతడి గ్రామంలో అందరూ వివాహానికి హాజరయ్యారు. పెళ్లి కూతుళ్లను అశ్వాలపై ఊరేగించారు. ఆరుగురు కూతుళ్ల వివాహంతో తండ్రి రోహితాక్షన్‌ ఉబ్బి తబ్బిబ్బయిపోయారు. వివాహాలు పూర్తయ్యాక భావోద్వేగానికి లోనయ్యారు.

Read latest National - International News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని