SpaceX: అంతరిక్షం నుంచి భూమిని చేరిన వ్యోమగాములు

నాసా పంపిన నలుగురు వ్యోమగాములు అంతరిక్ష కేంద్రం నుంచి సురక్షితంగా స్పేస్ ఎక్స్ వ్యోమనౌక ద్వారా భూమిని చేరుకున్నారు.

Published : 09 Nov 2021 23:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నాసా పంపిన నలుగురు వ్యోమగాములు అంతరిక్ష కేంద్రం నుంచి సురక్షితంగా స్పేస్ ఎక్స్ వ్యోమనౌక ద్వారా భూమిని చేరుకున్నారు. అంతరిక్షంలో 200 రోజులు పూర్తి చేసుకున్న వీరంతా సోమవారం రాత్రి ఫ్లోరిడాలోని గల్ఫ్ ఆఫ్ మెక్సికో సముద్రంలో దిగారు. వారిని పడవల ద్వారా భూమిపైకి తీసుకొచ్చారు. అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ నుంచి వీరు నలుగురు భూమిని చేరక ముందే.. మరో నలుగురిని పంపించాలని ప్రయత్నించినా.. వాతావరణం అనుకూలించలేదు. దీంతో వారిని బుధవారం రాత్రి పంపించేందుకు నాసా ఏర్పాట్లు చేస్తోంది. భూమికి తిరిగివచ్చిన వారిలో ఇద్దరు అమెరికా వ్యోమగాములు షేన్ కింబ్రో, మేఘన్ మెకార్థర్‌తోపాటు జపాన్‌కు చెందిన అకిహిడో హొషిదే, ఫ్రాన్స్‌కు చెందిన థామస్ పెస్క్వెట్ ఉన్నారు. 200 రోజులపాటు అంతరిక్షంలో వివిధ ప్రయోగాలు చేసిన ఈ నలుగురు.. స్పేస్ స్టేషన్ నుంచి బయలుదేరిన 8 గంటల్లోనే భూమిని చేరుకోవడం విశేషం. ప్రస్తుతం స్పేస్ స్టేషన్‌లో ఇద్దరు రష్యన్లు, ఓ అమెరికా వ్యోమగామి ఉన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని