Milkha: మిల్కా పేరుతో క్రీడా వర్సిటీలో విభాగం

కరోనా బారిన పడి మృతి చెందిన  భారత పరుగుల వీరుడు మిల్కాసింగ్‌ గౌరవార్థం పంజాబ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రీడా దిగ్గజ పేరుతో పటియాలాలోని స్పోర్ట్స్‌ యూనివర్సిటీలో....

Published : 19 Jun 2021 18:40 IST

పంజాబ్‌ సీఎం ప్రకటన

చండీగఢ్‌: కరోనా బారిన పడి కన్నుమూసిన భారత పరుగుల వీరుడు మిల్కాసింగ్‌ గౌరవార్థం పంజాబ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రీడా దిగ్గజం పేరుతో పటియాలాలోని స్పోర్ట్స్‌ యూనివర్సిటీలో ఓ శాఖను ఏర్పాటు చేయనున్నట్టు పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ ప్రకటించారు.  శనివారం ఆయన రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి రానా గుర్మిత్‌సింగ్‌తో కలిసి మిల్కా సింగ్‌ నివాసానికి వెళ్లారు. ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. మిల్కా సింగ్‌ తనయుడు జీవ్, కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం మిల్కా సింగ్‌ నివాసం బయట మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.

మే 20న కరోనా బారిన పడిన 91 ఏళ్ల మిల్కా సింగ్.. వైరస్‌తో పోరాడుతూ నిన్న రాత్రి ఆస్పత్రిలో  తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన మృతిపట్ల యావత్‌ క్రీడా ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది. మిల్కా సింగ్‌ మరణంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్రమంత్రులు, వివిధ రంగాల ప్రముఖులు నివాళులర్పించారు. ఆయన సాధించిన విజయాలను గుర్తు చేసుకుంటూ ట్వీట్లు పెడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని