Updated : 27/01/2021 15:38 IST

‘నేరుగా తాకితేనే వేధింపుల’న్న హైకోర్టు తీర్పుపై స్టే

దిల్లీ: చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించి బాంబే హైకోర్టు ఇచ్చిన ‘వివాదాస్పద’ తీర్పుపై సర్వోన్నత న్యాయస్థానం స్టే ఇచ్చింది. పోక్సో చట్టం ప్రకారం.. దుస్తుల మీద నుంచి శరీర భాగాలను తాకడం లైంగిక వేధింపుల కిందకు రాదని ఇటీవల హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడి శిక్షను రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పును అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 

బాంబే హైకోర్టు వ్యాఖ్యలు ఆందోళనకరమని, భవిష్యత్తులో ఇది ప్రమాదకరమైన ఉదాహరణగా మారే అవకాశముందని ఏజీ వేణుగోపాల్‌ అన్నారు. ఈ అంశంపై రేపు పిటిషన్‌ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. లేదంటే సుమోటాగా స్వీకరించి చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరారు. వేణుగోపాల్‌ అభ్యర్థనను స్వీకరించిన చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం.. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. నిందితుడికి నోటీసులు జారీ చేసింది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ పిటిషన్‌ దాఖలు చేయాలని ఏజీని ఆదేశించింది. 

బాంబే హైకోర్టు ఏం చెప్పిందంటే..

2016లో సతీష్‌ అనే వ్యక్తి బాధిత బాలికకు పండు ఇస్తానని ఆశ చూపి తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ బాలిక ఛాతీని తాకి ఆమె దుస్తులు విప్పడానికి యత్నించాడు. ఆ బాలిక కేకలు వేయడంతో తల్లి అక్కడికి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు కాగా దిగువ కోర్టు నిందితుణ్ని పోక్సో చట్టం కింద దోషిగా తేలుస్తూ మూడేళ్ల జైలు శిక్ష విధించింది. దీనిపై నిందితుడు హైకోర్టును ఆశ్రయించాడు.

 సతీశ్‌ పిటిషన్‌పై గతవారం విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. ‘పోక్సో’ చట్టం(లైంగిక వేధింపుల నుంచి చిన్నారుల్ని రక్షించడానికి ఉద్దేశించిన చట్టం) ప్రకారం.. దుస్తుల మీద నుంచి శరీర భాగాలను తాకడం లైంగిక వేధింపుల కిందకు రాదని బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది. ఓ బాలిక ఛాతీభాగాన్ని దుస్తులపై నుంచి తాకినంత మాత్రాన లైంగిక వేధింపులకు పాల్పడినట్లు చెప్పలేమని, చట్టం ఇదే విషయాన్ని విశదీకరిస్తోందని వ్యాఖ్యానించింది. లైంగిక ఉద్దేశంతో బాలిక దుస్తులు తొలగించి, లేదా దుస్తుల లోపలకి చేయి పెట్టి నేరుగా తాకితేనే అది లైంగిక వేధింపుల కిందకు వస్తుందని పేర్కొంది. ఈ కేసులో నిందితుడు బాలిక దుస్తులు తొలగించాడా లేదా దుస్తుల లోపలికి చేయి పెట్టాడా అన్న నిర్దిష్టమైన వివరాలు లేవు గనుక దీన్ని లైంగిక వేధింపుల కింద పరిగణించలేమని తెలిపింది. ఈ మేరకు కేసులో నిందితుడికి కింది కోర్టులో విధించిన మూడేళ్ల జైలు శిక్షను హైకోర్టు రద్దు చేసింది. అయితే బాంబే హైకోర్టు వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ తీర్పును ఖండించిన మహిళా సంఘాలు, సామాజిక కార్యకర్తలు.. దీనిపై సుప్రీంకోర్టును వెళ్తామని తెలిపారు.

ఇవీ చదవండి..

ఎర్రకోట ఘటనపై హోంశాఖ సీరియస్‌

దిల్లీ అల్లర్లు: దీప్‌ సిధు పాత్రేంటీ?


Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని