Taliban: తాలిబన్‌.. ఆ హత్యలు ఆపండి..!

అఫ్గానిస్థాన్‌ పౌర ప్రభుత్వం హాయంలో పనిచేసిన భద్రతా సిబ్బందిని తాలిబన్లు వేటాడి చంపడాన్ని వెంటనే ఆపేయాలని 22 దేశాలు డిమాండ్‌ చేశాయి. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని సూచించాయి.

Published : 05 Dec 2021 16:52 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అఫ్గానిస్థాన్‌ పౌర ప్రభుత్వం హయాంలో పనిచేసిన భద్రతా సిబ్బందిని తాలిబన్లు వేటాడి చంపడాన్ని వెంటనే ఆపేయాలని 22 దేశాలు డిమాండ్‌ చేశాయి. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని సూచించాయి. ‘‘వేటాడి మరీ హత్యలు చేయడాలు, వ్యక్తుల అదృశ్యాలపై అఫ్గానిస్థాన్‌ నుంచి వస్తున్న నివేదికలు ఆందోళనకు గురి చేస్తున్నాయి’’ అని సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. ఈ ప్రకటనపై అమెరికా, యూకే, ఐరోపా సమాఖ్య సహా మరో 19 దేశాలు సంతకాలు చేశాయి. ది హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌ నివేదిక బహిర్గతం చేసిన తర్వాత ఈ ప్రకటన వెలువడటం విశేషం. ఈ సంస్థ నివేదిక ప్రకారం ఇప్పటి వరకు మొత్తం 100కుపైగా అపహరణలు, హత్యలు జరిగినట్లు సమాచారం.

ఈ ప్రకటనపై తాలిబన్‌ ప్రతినిధి ఇనాముల్లా సమాంఘనీ న్యూయార్క్‌ టైమ్స్‌ వద్ద స్పందించారు. కొన్ని చోట్ల తాలిబన్‌ ఫైటర్లు పాత కక్షలు తీర్చుకోవడానికి చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అంతేకానీ, హత్యలు, అపహరణలు తాలిబన్ల విధానం కాదని తెలిపారు. తాము క్షమాభిక్షకు కట్టుబడి ఉంటామని తెలిపారు. ఇటువంటి హత్యలు ఇస్లామిక్‌ ఎమిరేట్స్‌ ప్రయోజనాలకు భంగకరమని వెల్లడించారు.

అమ్నెస్టి సంస్థ అక్టోబర్‌లో విడుదల చేసిన ఓ నివేదికలో కూడా ఇటువంటి హత్యలను వెల్లడించింది. ఆగస్టు 30వ తేదీన 300 తాలిబన్లు ధానీ ఖుల్‌ గ్రామంపై దాడి చేశారు. ఇక్కడ ప్రభుత్వ బలగాల సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు. ఇక్కడ తాలిబన్లకు లొంగిపోయిన దాదాపు 9 మంది ప్రభుత్వ సైనికులను హత్య చేశారు. మరో ఇద్దరు కాల్పుల్లో చనిపోయారు. ఈ క్రమంలో 17 ఏళ్ల  బాలిక కూడా ప్రాణాలు కోల్పోయింది.

Read latest National - International News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని