Space Trip: అమెజాన్‌లో ఒక్క వస్తువూ కొనలేదని జెఫ్‌ బెజోస్‌తో చెప్పా..

అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌తో మరో ముగ్గురు విజయవంతంగా రోదసియాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ఈ రోదసియాత్రలో ఆలివర్‌ డేమన్‌ (18) అత్యంత పిన్న వయసులో అంతరిక్షయానం చేసి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అయితే అంతరిక్ష ప్రయాణ సమయంలో జెఫ్‌

Published : 25 Jul 2021 01:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌తో మరో ముగ్గురు విజయవంతంగా రోదసియాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ఈ రోదసియాత్రలో ఆలివర్‌ డేమన్‌ (18) అత్యంత పిన్న వయసులో అంతరిక్షయానం చేసి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అయితే అంతరిక్ష ప్రయాణ సమయంలో జెఫ్‌ బెజోస్‌తో తాను ఓ ఆసక్తికర అంశాన్ని పంచుకున్నట్లు డేమన్‌ తెలిపాడు. అమెజాన్‌లో తాను ఇప్పటివరకు ఒక్క వస్తువు కూడా కొనలేదని జెబోస్‌తో చెప్పినట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. దానికి బెజోస్‌ స్పందిస్తూ ‘ఓ వావ్‌! చాలా కాలం తర్వాత ఓ వ్యక్తి నాతో ఇలా చెప్పడం వింటున్నా’ అని సమాధానమిచ్చినట్లు డేమన్‌ తెలిపాడు.

రోదసీ యాత్ర కోసం బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్‌ అంతరిక్ష సంస్థ నిర్వహించిన వేలంలో ఏకంగా 2.8 కోట్ల డాలర్లకు ఓ ధనికుడు టికెట్‌ సంపాదించారు. అయితే ఇతరత్రా పనుల కారణంగా ఆయన తన యాత్రను వాయిదా వేసుకున్నారు. దీంతో ఆ సీటును డేమన్‌కు కేటాయించారు. దీనిపై డేమన్‌ మాట్లాడుతూ.. ‘2.8 కోట్ల డాలర్లు కట్టేంతగా డబ్బులు తన దగ్గర లేవన్నాడు. అయితే తాను పిన్న వయస్కుడితో పాటు పైలట్‌ కావడం, ఈ అంతరిక్ష ప్రయాణం గురించి కొంత తనకు తెలుసునని, అందుకే తనని ఎంపిక చేశారని భావిస్తున్నట్లు డేమన్‌ పేర్కొన్నాడు. తనను ఎంపిక చేసిన సమయంలో కుటుంబసభ్యులతో ఇటలీలో విహరిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ‘రాకెట్‌ ప్రయాణం నాకో కలలా గడిచింది. అవి అద్భుత క్షణాలు. అంతరిక్ష ప్రయాణం నా జీవిత లక్ష్యం. అది ఇంత త్వరగా నెరవేరుతుందని అనుకోలేదు’ అని పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని