Published : 08/11/2021 14:14 IST

Demonetisation: ‘ఆ క్రూర నిర్ణయానికి నేటికి ఐదేళ్లు’

తృణమూల్‌ కాంగ్రెస్‌ విమర్శలు

కోల్‌కతా: దేశంలో పెద్దనోట్లను రద్దు చేస్తూ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుని నేటికి ఐదేళ్లు పూర్తయ్యాయి. అప్పటి ఈ కీలక నిర్ణయాన్ని కేంద్రం సమర్థించుకుంటుండగా.. విపక్షాలు మాత్రం తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నాయి. దీనిపై తాజాగా తృణమూల్ కాంగ్రెస్ స్పందించింది. ‘2016 నవంబర్ 8న కేంద్రం నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించగానే.. మమతా బెనర్జీ మాత్రమే దాన్ని గుర్తించారు. ఆ క్రూరమైన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వరుసగా ట్వీట్లు చేశారు’ అంటూ తృణమూల్‌ సీనియర్ నేత డెరెక్ ఓబ్రీన్ వెల్లడించారు. అలాగే ఆ సమయంలో మమత చేసిన ట్వీట్ల స్క్రీన్‌షాట్‌ను జత చేశారు.

‘ఈ క్రూరమైన నిర్ణయాన్ని ఉపసంహరించుకోండి’ అంటూ పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ వేళ కేంద్రానికి సూచించారు. ఆ తర్వాత వరుస ట్వీట్లలో కేంద్ర ప్రభుత్వ ప్రకటనను వ్యతిరేకించారు. ఎన్నికల వేళ నల్లధనాన్ని వెనక్కి తీసుకువస్తామని ఇచ్చిన హామీలను నెరవేర్చలేక.. ఆ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునేందుకు తీసుకున్న నిర్ణయమంటూ మండిపడ్డారు. చిన్న వ్యాపారులు, సామాన్య ప్రజల గురించి వాటిలో ఆందోళన వ్యక్తం చేశారు.

నోట్ల రద్దుపై ఈ రోజు కాంగ్రెస్ నేత ప్రియాంకాగాంధీ ‘డీమానిటైజేషన్ డిజాస్టర్’ అంటూ ట్విటర్‌లో స్పందించారు. నోట్ల రద్దు వెనుక ఉన్న ప్రభుత్వ ఉద్దేశం ఎందుకు నెరవేరలేదని ప్రశ్నించారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని