Published : 22/11/2021 16:52 IST

కరోనా ఎఫెక్ట్‌.. పొదుపు, ఎంజాయ్‌మెంట్‌ ఉండాలంటున్న భారతీయుడు..!

డెలాయిట్ సర్వేలో వెల్లడి

దిల్లీ: కరోనా మహమ్మారి తర్వాత ఇంటికే పరిమితమైన ప్రజలు ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలని కోరుకుంటున్నారట. ద్రవ్యోల్బణ పరిస్థితులు ఉన్నప్పటికీ తమ అభిరుచులకే ప్రాధాన్యం అంటున్నారట. డెలాయిట్ సంస్థ నిర్వహించిన సర్వేలో భారతీయులు ప్రస్తుత ఆలోచనా విధానం ఎలా ఉందో వెల్లడైంది. 

‘భారతీయులు అర్థవంతంగా ఖర్చు చేస్తున్నారు. వర్తమానంలో జీవించడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. కొత్త అభిరుచులకు అనుగుణంగా ముందుకు వెళ్లడంతో పాటు తమ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే బ్రాండ్ల వైపు మొగ్గుచూపుతున్నారు’ అని ఆ సర్వే వెల్లడించింది. అలాగే ద్రవ్యోల్బణ పరిస్థితులు ఉన్నప్పటికీ.. జీవితంలో సమతుల్యం ఉండాలని కోరుకుంటున్నారని తెలిపింది. భవిష్యత్తు కోసం పొదుపు చేయాలనుకోవడంతో పాటు  తమ అభిరుచులు, వస్తువుల కోసం ఖర్చు చేయాలనుకుంటున్నారని పేర్కొంది. ఒకవైపు 74 శాతం మంది ద్రవ్యోల్బణం గురించి కంగారు పడుతుండగా.. అదే సమయంలో 85 శాతం మంది రానున్న నాలుగు వారాల్లో ప్రయాణాలు చేయాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. 68 శాతం మంది రెస్టారెంట్లకు వెళ్లడం సురక్షితమేనని భావిస్తుండగా..74 శాతం మంది రానున్న ఆరు నెలల్లో కొత్త వాహనం కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు. 65 శాతం మంది విమానాల్లో ప్రయాణించడం, హోటళ్లలో బస చేయడంలో ఏ ఇబ్బంది లేదనుకుంటున్నారని వెల్లడించింది. 

ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది మొదలైన కరోనా మహమ్మారి విజృంభణ ఇప్పటికీ కొనసాగుతోంది. భారత్‌లో మొదటి, రెండు దశల్లో వైరస్ విజృంభించడంతో అల్లాడిపోయిన ప్రజలు కొన్ని నెలల పాటు ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. ఈ క్రమంలో నిర్వహించిన సర్వేలో ప్రజలు ఆకాంక్షలు వెల్లడయ్యాయి. 

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని