Farm Laws: సాగు చట్టాలు రద్దయ్యాయి.. మరి రైతులపై ఉన్న కేసుల సంగతేంటి..?
సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించి శుక్రవారం ప్రధాని మోదీ దేశ ప్రజలను ఆశ్చర్యపర్చారు. అయితే ఈ చట్టాలపై దేశవ్యాప్తంగా మరీ ముఖ్యంగా పంజాబ్, హరియాణా, యూపీలోని కొన్ని ప్రాంతాల్లో నిరసన వ్యక్తమైన సంగతి తెలిసిందే. దానిలో భాగంగా జరిగిన ఘటనల్లో పోలీసులు పలువురు నిరసనకారులపై కేసులు నమోదుచేశారు.
దిల్లీ: సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించి శుక్రవారం ప్రధాని మోదీ దేశ ప్రజలను ఆశ్చర్యపర్చారు. అయితే ఈ చట్టాలపై దేశవ్యాప్తంగా మరీ ముఖ్యంగా పంజాబ్, హరియాణా, యూపీలోని కొన్ని ప్రాంతాల్లో నిరసన వ్యక్తమైన సంగతి తెలిసిందే. దానిలో భాగంగా జరిగిన ఘటనల్లో పోలీసులు పలువురు నిరసనకారులపై కేసులు నమోదుచేశారు. ఇప్పుడు చట్టాల రద్దుతో ఆ కేసులు సంగతేంటనే ప్రశ్న అందరిలో మొదలైంది. అయితే దిల్లీ పోలీసు విభాగానికి చెందిన ఓ అధికారి మాత్రం ఈ కేసుల్లో దర్యాప్తు కొనసాగుతుందని అన్నారు.
‘నిరసనకారులపై ఆస్తుల ధ్వంసం, ఆదేశాల ఉల్లంఘనతో సహా కొన్ని క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అలాగే ఉపా(అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్) కింద కేసులు నమోదయ్యాయి. వాటిపై దర్యాప్తు కొనసాగుతుంది’ అని వెల్లడించారు. ప్రభుత్వం తలుచుకుంటే ఆ కేసుల విషయంలో కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసి వెనక్కి తీసుకునే వీలుందన్నారు.
సాగు చట్టాలపై నిరసన వ్యక్తం చేసిన క్రమంలో దిల్లీలో రైతులపై 39 కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని ఫిబ్రవరిలో కేంద్రం పార్లమెంట్‌కు తెలిపింది. 136 కేసులు నమోదైనట్లు హరియాణా ప్రభుత్వం అసెంబ్లీలో వెల్లడించింది. ఆ రాష్ట్రంలోని కొన్ని పోలీసు స్టేషన్లలో సుమారు 10వేల మంది అజ్ఞాత రైతులపై కేసులు పెట్టినట్లు నివేదికలను బట్టి తెలుస్తోంది. సోనేపత్లో 26 ఎఫ్ఐఆర్లు, అంబాలాలో 15, కురుక్షేత్రలో 14 రిజిస్టర్ అయ్యాయి. ఓ రైతు సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం హరియాణాలో దాదాపు 2,500 మందిపై కేసులు నమోదయ్యాయి. సాగు చట్టాలను వ్యతిరేకించిన నిరసనకారులపై ఇన్ని కేసులున్న నేపథ్యంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి..!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్‌కు క్లీన్చిట్
లోక్‌సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్‌కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్‌లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్‌కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్‌డే!
ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్‌గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్‌కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!