Tomato: 63% పెరిగిన టమాటా ధర: కేంద్రం

టమాటా ధర ప్రస్తుతం మార్కెట్‌లో కిలో రూ.67 పలుకుతోందని, అది గత ఏడాది కంటే 63% అధికమని కేంద్ర వినియోగ వ్యవహారాల శాఖ పేర్కొంది. ‘తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ,

Published : 27 Nov 2021 08:30 IST

ఈనాడు, దిల్లీ: టమాటా ధర ప్రస్తుతం మార్కెట్‌లో కిలో రూ.67 పలుకుతోందని, అది గత ఏడాది కంటే 63% అధికమని కేంద్ర వినియోగ వ్యవహారాల శాఖ పేర్కొంది. ‘తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవడంతో ఉత్తర భారత రాష్ట్రాలకు సరకు రావడంలో అడ్డంకులు ఏర్పడ్డాయని, అందువల్ల సెప్టెంబరు చివరి నుంచి క్రమంగా ధరలు పెరుగుతున్నాయి. ఉత్తర భారత రాష్ట్రాల నుంచి టమాటా దిగుబడులు డిసెంబరు నుంచి ప్రారంభమవుతాయి. అప్పటి నుంచి ధరల తగ్గుదలకు అవకాశం ఉంటుంది’ అని వివరించింది. ‘ధరల స్థిరీకరణ నిధి కింద రాష్ట్రాలకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నాం. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, అస్సాం, ఒడిశా, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాలకు కేంద్ర వాటా నుంచి రూ.164.15 కోట్లు విడుదలయ్యాయి. కాబట్టి ఈ రాష్ట్రాలు నిత్యావసరవస్తువుల ధరల నియంత్రణకు తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి’ అని కేంద్ర వినియోగ వ్యవహారాల శాఖ సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని