Ladyfinger: పోషకాల బెండ.. కేజీ ధరెంతో తెలిస్తే అవాక్కవుతారు!

కేజీ బెండకాయలు ఎంత? ప్రస్తుతం హైదరాబాద్‌ మార్కెట్‌లో అయితే రూ.30 నుంచి రూ.40 మధ్య ధర పలుకుతోంది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ జిల్లా కజురీ కలాన్‌కు చెందిన రైతు మిస్రీలాల్‌ రాజ్‌పుత్‌

Updated : 07 Sep 2021 08:58 IST

భోపాల్‌: కేజీ బెండకాయలు ఎంత? ప్రస్తుతం హైదరాబాద్‌ మార్కెట్‌లో అయితే రూ.30 నుంచి రూ.40 మధ్య ధర పలుకుతోంది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ జిల్లా కజురీ కలాన్‌కు చెందిన రైతు మిస్రీలాల్‌ రాజ్‌పుత్‌ పండిస్తున్న ఎరుపు రంగు బెండకాయల ధర మాత్రం ఏకంగా రూ.800 వరకు పలుకుతోంది. సాధారణ ఆకుపచ్చ రంగు బెండకాయలతో పోల్చితే తాను పండించేవి మరింత ఆరోగ్యకరమని రైతు చెబుతున్నారు. ‘‘నేను సాగుచేసే బెండకాయలు ఎరుపు రంగులో ఉంటాయి. సాధారణ బెండకాయలతో పోల్చితే వీటిలో పోషక విలువలు ఎక్కువ. గుండె జబ్బులు, రక్తపోటు, మధుమేహం, అధిక కొవ్వుతో బాధపడేవారికి అత్యంత మంచివి’’ అని రాజ్‌పుత్‌ వివరించారు. ఎరుపు రంగు బెండకాయల ధర సాధారణ రకం కంటే అనేక రెట్లు ఎక్కువ పలుకుతోందని చెప్పారు. వారణాసిలోని ఓ పరిశోధన సంస్థ నుంచి 40 రోజుల క్రితం కేజీ విత్తనాలు కొని పొలంలో నాటానని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని