పెగాసస్‌లాంటి సాంకేతికతలు అవసరమే.. స్పైవేర్‌ను సమర్థించుకున్న ఎన్‌ఎస్‌వో గ్రూపు

ప్రపంచంలో లక్షల మంది ప్రజలకు రాత్రిపూట మంచినిద్ర పడుతోందంటే అది పెగాసస్‌ వంటి నిఘా సాఫ్ట్‌వేర్‌ల వల్లనేనని ఇజ్రాయెల్‌కు చెందిన సైబర్‌ సెక్యూరిటీ కంపెనీ ఎన్‌ఎస్‌వో గ్రూపు సమర్థించుకుంది. లక్షల మంది రోడ్లపై సురక్షితంగా తిరిగేందుకు ఇలాంటి సాంకేతికతలే దోహదం చేస్తున్నాయంది.

Updated : 25 Jul 2021 07:19 IST

జెరూసలెం: ప్రపంచంలో లక్షల మంది ప్రజలకు రాత్రిపూట మంచినిద్ర పడుతోందంటే అది పెగాసస్‌ వంటి నిఘా సాఫ్ట్‌వేర్‌ల వల్లనేనని ఇజ్రాయెల్‌కు చెందిన సైబర్‌ సెక్యూరిటీ కంపెనీ ఎన్‌ఎస్‌వో గ్రూపు సమర్థించుకుంది. లక్షల మంది రోడ్లపై సురక్షితంగా తిరిగేందుకు ఇలాంటి సాంకేతికతలే దోహదం చేస్తున్నాయంది. ఈ సాంకేతికతను నిర్వహించేది తాము కాదని, క్లెయింట్లు సేకరించే డేటా తమకేమీ అందుబాటులో ఉండదని స్పష్టం చేసింది. రాజకీయ నాయకులు, పాత్రికేయులు, మానవ హక్కుల ఉద్యమకర్తలు, ఇతర ప్రముఖుల ఫోన్లపై నిఘాకు పెగాసస్‌ స్పైవేర్‌ను వాడడంపై భారత్‌ సహా పలు దేశాల్లో పెద్దఎత్తున దుమారం చెలరేగుతున్న నేపథ్యంలో దాని మాతృసంస్థ ఎన్‌ఎస్‌వో ఈ మేరకు స్పందించింది. ‘మేం సమకూరుస్తున్న టెక్నాలజీల సాయంతో నిఘా సంస్థలు ప్రపంచంలో అనేక చోట్ల నేరాలపై, ఉగ్రవాదంపై దర్యాప్తు చేయగలుగుతున్నాయి. నేరగాళ్లపై నిఘా విధించగలుగుతున్నాయి. నిగూఢపరిచిన సమాచారాన్ని వెలికితీయడంలోనూ ఇవి కీలకంగా నిలుస్తున్నాయి. ప్రపంచంలో సైబర్‌ నిఘాకు మా సంస్థలాంటివి తోడ్పాటును అందిస్తున్నాయి. సురక్షితమైన ప్రపంచం కోసం మా వంతు ప్రయత్నాలు చేస్తున్నాం’ అని వివరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు