కట్నం డబ్బు రూ.75 లక్షలు బాలికల వసతి గృహానికి విరాళం

రాజస్థాన్‌లోని బాడ్‌మేడ్‌ జిల్లాలో ఓ నవ వధువు.. వరకట్నం కింద తన తండ్రి ఇచ్చిన రూ.75 లక్షలను బాలికల వసతిగృహ నిర్మాణం కోసం విరాళంగా అందజేయడం ద్వారా ఆదర్శంగా నిలిచారు.

Updated : 27 Nov 2021 08:48 IST

బాడ్‌మేడ్‌: రాజస్థాన్‌లోని బాడ్‌మేడ్‌ జిల్లాలో ఓ నవ వధువు.. వరకట్నం కింద తన తండ్రి ఇచ్చిన రూ.75 లక్షలను బాలికల వసతిగృహ నిర్మాణం కోసం విరాళంగా అందజేయడం ద్వారా ఆదర్శంగా నిలిచారు. స్థానిక యువతి అంజలికి ప్రవీణ్‌ సింగ్‌ అనే వ్యక్తితో ఈ నెల 21న వివాహమైంది. కట్నం కింద తనకు సంతకం చేసి ఉన్న ఖాళీ చెక్కు కావాలని ఆమె తన తండ్రిని ముందే అడిగారు.  ఆయన అనుమతితో ఆ మొత్తానికి చెక్కు రాసి వసతిగృహ నిర్మాణం కోసం అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని