Petrol price: పెట్రో ధరలకు మళ్లీ రెక్కలు!

అంతర్జాతీయ మార్కెట్లోని తాజా పరిణామాల నేపథ్యంలో ఆగస్టు చివరివారం నుంచి ముడిచమురు ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. దీని ప్రభావం దేశంలోని

Published : 18 Sep 2021 06:41 IST

దిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లోని తాజా పరిణామాల నేపథ్యంలో ఆగస్టు చివరివారం నుంచి ముడిచమురు ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. దీని ప్రభావం దేశంలోని రీటెయిల్‌ మార్కెట్లో పెట్రోలు, డీజిలు అమ్మకాలపై తప్పనిసరిగా ఉంటుంది. ఆయిల్‌ కంపెనీలు విపరీతమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. గత పక్షం రోజులుగా దేశంలోని పెట్రో ధరల్లో పెంపుదల లేదు. అంతర్జాతీయ మార్కెట్లో ఇపుడున్న పరిస్థితుల్లో ధరలు పెంచక తప్పదని ఆ వర్గాలు తెలిపాయి. ఆగస్టు నెలలో ఉన్న సగటు ధరలతో పోలిస్తే బ్యారెల్‌ చమురు ధర 4 నుంచి 6 అమెరికన్‌ డాలర్లమేర పెరిగింది. దిల్లీలో ప్రస్తుతం లీటరు పెట్రోలు రూ.101.19, డీజిలు రూ.88.62 పలుకుతున్నాయి. మెక్సికో సమీపంలోని సముద్రపు ఒడ్డున అగ్నిప్రమాదంతో ఉత్తర అమెరికాలో క్రూడాయిల్‌ ఉత్పత్తి తగ్గింది. యూఎస్‌ - గల్ఫ్‌ తీరంలో ఇడా తుపాను అవాంతరాలతో చమురు ధరలు బాగా పెరిగాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని