Anand Mahindra: ఏనుగుకు ఆర్థిక వ్యవస్థకు ముడిపెట్టిన మహీంద్రా..!

ప్రపంచంలో జరిగే సరికొత్త, సహజమైన అంశాలకు తన దృష్టి కోణాన్ని జత చేస్తుంటారు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా. తన భారీ దేహంతో చెక్క ఫెన్సింగ్‌ను దాటడానికి ప్రయత్నించి, సఫలమైన ఏనుగుకు సంబంధించిన వీడియో కొద్దికాలంగా నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

Published : 23 Nov 2021 13:49 IST

ముంబయి: ప్రపంచంలో జరిగే సరికొత్త, సహజమైన అంశాలకు తన దృష్టి కోణాన్ని జత చేస్తుంటారు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా. తన భారీ దేహంతో చెక్క ఫెన్సింగ్‌ను దాటడానికి ప్రయత్నించి, సఫలమైన ఏనుగుకు సంబంధించిన వీడియో కొద్దికాలంగా నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ ఏనుగు ప్రయత్నానికి, భారత ఆర్థిక వ్యవస్థ పనితీరుకు ముడిపెడుతూ మహీంద్రా తనదైన శైలిలో విశ్లేషణ ఇచ్చారు. 

‘భారత ఆర్థికవ్యవస్థను తరచూ ఏనుగుతో పోలుస్తారు. అయితే ఈ మధ్యకాలంలో అది వేగంగా వృద్ధి చెందుతుండటంతో దానికి పులితో పోలిక పెడుతున్నారు. ఒకవేళ అది మేమే(ఏనుగు) అయినా.. మా మార్గంలో ఎలాంటి ఇబ్బందికర సవాళ్లు ఎదురైనప్పటికీ.. వాటిని అధిగమిస్తాం!’ అంటూ ఏనుగుకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఆయన వివరించిన తీరుకు నెటిజన్లు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. ‘ఏనుగు అంటే బలం, భారీతనం, సమతుల్యత అని అర్థం. అది మామూలుగా ప్రశాంతంగా ఉంటుంది. కానీ దానికి ఎవరైనా కోపం తెప్పించారో.. తీవ్రంగా స్పందిస్తుంది. గొప్ప జ్ఞాపకశక్తి (వేదాలు, సంప్రదాయ ఔషధాన్ని ఉద్దేశిస్తూ) ఏనుగు సొంతం’ అంటూ ఓ నెటిజన్ స్పందించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని