Cat: నాలాలో పడేసిన శిశువును రక్షించిన పిల్లి!
మానవత్వానికి మాయని మచ్చతెచ్చేలా... ఓ వ్యక్తి పొత్తిళ్లలో చుట్టిన శిశువును నాలాలో పడేయగా, అక్కడే తచ్చాడుతున్న పిల్లి ఒకటి ఆ బిడ్డను రక్షించింది! ముంబయి శివారులోని ఘట్కోపర్ ఠాణా పరిధిలో ఈ ఘటన
ముంబయి: మానవత్వానికి మాయని మచ్చతెచ్చేలా... ఓ వ్యక్తి పొత్తిళ్లలో చుట్టిన శిశువును నాలాలో పడేయగా, అక్కడే తచ్చాడుతున్న పిల్లి ఒకటి ఆ బిడ్డను రక్షించింది! ముంబయి శివారులోని ఘట్కోపర్ ఠాణా పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని ఓ వ్యక్తి... వస్త్రాల్లో చుట్టిన ఓ శిశువును ఘట్కోపర్లోని రామాబాయ్నగర్ నాలాలో పడేశాడు. ఇది గమనించిన ఓ పిల్లి... అక్కడక్కడే తిరుగుతూ వింతగా ప్రవర్తించింది. నాలాలో శిశువు వద్దకు వెళ్లి బిగ్గరగా అరిచింది. ఈ క్రమంలో బిడ్డ ఏడవడంతో చుట్టుపక్కలవారు పరుగు పరుగున వచ్చి చూశారు. శిశువును రక్షించి, స్థానిక పోలీసులకు అప్పగించారు. వారు రాజవాడి ఆసుపత్రిలో బిడ్డను చేర్చి, కేసు నమోదు చేశారు. శిశువు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం