CBSE 10th Results: పదో తరగతిలో 99.04% మంది పాసయ్యారు 

సెంట్రోల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌(సీబీఎస్‌ఈ) 10వ తరగతి ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 99.04శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

Published : 03 Aug 2021 13:25 IST

దిల్లీ: సెంట్రోల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌(సీబీఎస్‌ఈ) 10వ తరగతి ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 99.04శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గతేడాదితో పోలిస్తే ఈ సారి ఉత్తీర్ణత 8శాతానికి పైగా పెరిగినట్లు సీబీఎస్‌ఈ వెల్లడించింది. 2020లో 91.46శాతం మంది విద్యార్థులు పాసయ్యారు.

అత్యధికంగా త్రివేంద్రం(కేరళ)లో 99.99శాతం, ఆ తర్వాత బెంగళూరు(కర్ణాటక)లో 99.96శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలుర కంటే బాలికలు 0.35శాతం మేర అధికంగా ఉత్తీర్ణత సాధించారు. కేంద్రీయ విద్యాలయాల్లో 100శాతం విద్యార్థులు పాసవ్వగా.. జేఎన్‌వీల్లో 99.99శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ప్రస్తుతం 20,97,128 మంది విద్యార్థుల ఫలితాలను వెల్లడించగా.. అందులో  57,824 మంది 95శాతానికి పైగా మార్కులు సాధించారు. 2,00,962 మంది విద్యార్థులు 90 నుంచి 95శాతం మార్కులు సాధించినట్లు బోర్డు వెల్లడించింది.  ఇంకా 16,639 మంది విద్యార్థుల ఫలితాలు వెయిటింగ్‌లో ఉన్నాయి. వారి గ్రేడ్లను కూడా త్వరలోనే వెల్లడిస్తామని సీబీఎస్‌ఈ బోర్డు తెలిపింది. కంపార్ట్‌మెంట్‌ కింద 17,636 మంది విద్యార్థులు ఉండగా.. వీరికి ఆగస్టు 16 నుంచి సెప్టెంబరు 15 మధ్య కంపార్ట్‌మెంట్‌పరీక్షలు నిర్వహిస్తామని బోర్డు వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని