Covaxin: కొవాగ్జిన్‌తో రోగనిరోధక జ్ఞాపకశక్తి పదిలం: ఎన్‌ఐఐ

కొవాగ్జిన్‌ టీకా తీసుకున్నవారి ప్రతిరక్షకాల్లో కొవిడ్‌-19 కారక సార్స్‌కోవ్‌-2 వైరస్‌కు సంబంధించిన రోగనిరోధక జ్ఞాపకశక్తి ఆరు నెలల వరకు ఉంటున్నట్లు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇమ్యునాలజీ (ఎన్‌ఐఐ) డైరెక్టర్‌ పుష్కర్‌శర్మ తెలిపారు.

Updated : 16 Nov 2021 11:33 IST

దిల్లీ: కొవాగ్జిన్‌ టీకా తీసుకున్నవారి ప్రతిరక్షకాల్లో కొవిడ్‌-19 కారక సార్స్‌కోవ్‌-2 వైరస్‌కు సంబంధించిన రోగనిరోధక జ్ఞాపకశక్తి ఆరు నెలల వరకు ఉంటున్నట్లు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇమ్యునాలజీ (ఎన్‌ఐఐ) డైరెక్టర్‌ పుష్కర్‌శర్మ తెలిపారు. అందువల్ల ఆ టీకా నుంచి కనీసం ఆరు నెలల వరకు రక్షణ లభిస్తుందని చెప్పారు. ఆదివారం కేంద్ర శాస్త్రసాంకేతిక శాఖ మంత్రి జితేంద్రసింగ్‌ అధ్యక్షతన జరిగిన ఎన్‌ఐఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో పుష్కర్‌శర్మ ఈ విషయాన్ని వెల్లడించారు. కరోనా వైరస్‌ వేరియంట్లైన డెల్టా, ఆల్ఫా, బీటా, గామాలకు సంబంధించి కూడా కొవాగ్జిన్‌ టీకా కణసంబంధ జ్ఞాపకశక్తిని కలిగి ఉందని, అది ఆరు నెలల వరకు కొనసాగుతుందని స్పష్టంచేశారు. గతంలో ఎదుర్కొన్న రోగ కారకాలను గుర్తించగానే రోగనిరోధక వ్యవస్థ వేగంగా, సమర్థంగా స్పందించే సామర్థ్యమే రోగనిరోధక జ్ఞాపకశక్తి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని