India Corona: 10 వేలకు పైగా కొత్త కేసులు.. తగ్గిన రికవరీలు 

స్వల్ప హెచ్చుతగ్గులు మినహాయించి దేశంలో కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉంది. గురువారం 11,81,246 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 10,549 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది.

Updated : 26 Nov 2021 11:25 IST

120 కోట్ల మార్కు దాటిన టీకా డోసుల పంపిణీ 

దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉంది. కొత్త కేసుల్లో స్వల్ప హెచ్చతగ్గులు నమోదవుతున్నాయి. గురువారం 11,81,246 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 10,549 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ముందురోజుకంటే అదనంగా వేయికి పైగా కొత్త కేసులు వెలుగుచూశాయి. 24 గంటల వ్యవధిలో 488 మరణాలు సంభవించాయి. ఒక్క కేరళలోనే నిన్న 5,987 కేసులు, 384 మరణాలు నమోదయ్యాయని శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత ఏడాది ప్రారంభం నుంచి కరోనా బారినపడిన వారి సంఖ్య 3.45 కోట్లకు చేరగా.. 4,67,468 మంది ప్రాణాలు కోల్పోయారు.

నిన్న 9,868 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీలు 3.39 కోట్లు(98.33 శాతం)గా ఉన్నాయి. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 1,10,133గా ఉంది. ఆ రేటు 0.32 శాతంగా కొనసాగుతోంది. మరోపక్క నిన్న 83,88,824 మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 120 కోట్ల మార్కు దాటింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని