India Corona: కొత్త కేసులు 8 వేలే.. కానీ కలవరపెడుతోన్న ఒమిక్రాన్‌

దేశంలో కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉంది. కొద్ది రోజులుగా కొత్త కేసులు 10 వేలకు దిగువనే నమోదవుతున్నాయి. తాజాగా 8,86,263 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా..8,306 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది.

Updated : 06 Dec 2021 12:02 IST

552 రోజుల కనిష్ఠానికి క్రియాశీల కేసులు 

దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉంది. కొద్ది రోజులుగా కొత్త కేసులు 10 వేలకు దిగువనే నమోదవుతున్నాయి. తాజాగా 8,86,263 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా..8,306 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. నిన్న ఒక్కరోజే 8,834 మంది కోలుకున్నారు. గత ఏడాది ప్రారంభం నుంచి 3.46 కోట్ల మందికి కరోనా సోకగా.. 3.40 కోట్ల మంది వైరస్‌ను జయించారని సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

మహమ్మారి విజృంభణ అదుపులోనే ఉండటంతో క్రియాశీల కేసులు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. అవి 552 రోజుల కనిష్ఠానికి పడిపోయి..98,416కి చేరాయి.  క్రియాశీల రేటు 0.28 శాతానికి తగ్గగా..రికవరీ రేటు 98.35 శాతానికి పెరిగింది. 24 గంటల వ్యవధిలో 211 మరణాలు సంభవించాయి. ఇప్పటివరకు 4.73లక్షల మంది కరోనాకు బలయ్యారు. నిన్న 24.5లక్షల మంది టీకా వేయించుకున్నారు. మొత్తంగా 127 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి.

దేశంలో కరోనా వ్యాప్తి కాస్త ఊరటనిస్తున్నప్పటికీ .. కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు ఆ వేరియంట్‌కు చెందిన 21 కేసులు వెలుగుచూశాయి. వచ్చే రెండు నెలల్లో స్వల్పస్థాయిలో థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలు కొవిడ్ నిబంధనల విషయంలో ఏమాత్రం అలసత్వం చూపొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని