India Corona: భారీగా తగ్గిన కొత్త కేసులు.. అయినా అలక్ష్యం వద్దు..!

దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. సుమారు 18 నెలల కనిష్ఠానికి క్షీణించాయి. సోమవారం 10,79,384 మందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 6,822 మంది వైరస్ బారినపడినట్లు తేలింది.

Updated : 07 Dec 2021 12:34 IST

దిల్లీ: దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. సుమారు 18 నెలల కనిష్ఠానికి క్షీణించాయి. సోమవారం 10,79,384 మందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 6,822 మంది వైరస్ బారినపడినట్లు తేలింది. కేరళలో 3,277 మందికి కరోనా సోకింది. అలాగే నిన్న 10,004 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 3.46 కోట్ల మంది మహమ్మారి బారినపడగా.. 3.40 కోట్ల మంది కోలుకున్నారు.

మరోపక్క క్రియాశీల కేసులు 554 రోజుల కనిష్ఠానికి పడిపోయాయి. ప్రస్తుతం బాధితుల సంఖ్య 95,014కి తగ్గింది. క్రియాశీల రేటు 0.27 శాతానికి తగ్గగా.. రికవరీ రేటు 98.36 శాతానికి పెరిగింది. 24 గంటల వ్యవధిలో 220 మరణాలు సంభవించాయి. ఒక్క కేరళలోనే 168 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా 4.73 లక్షల మంది కరోనా కాటుకు బలయ్యారు. ఇక నిన్న 79.3 లక్షల మంది టీకా వేయించుకోగా.. మొత్తం మీద 128 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది. ఈ లెక్కలన్నీ ఊరటనిస్తున్నప్పటికీ.. ఒమిక్రాన్ కలవరం నేపథ్యంలో ఏమాత్రం అజాగ్రత్త వద్దని ప్రజల్ని అప్రమత్తం చేసింది. ప్రస్తుతం దేశంలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 23కి చేరింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని