US: కమలా హారిస్‌కు అమెరికా తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు

అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్‌ తన అధికారాలను శుక్రవారం కొన్ని గంటల పాటు ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు బదిలీ చేశారు. సాధారణ వైద్యపరీక్షల్లో భాగంగా ఆయనకు

Updated : 20 Nov 2021 11:26 IST

బేతెస్థ (అమెరికా): అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్‌ తన అధికారాలను శుక్రవారం కొన్ని గంటల పాటు ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు బదిలీ చేశారు. సాధారణ వైద్యపరీక్షల్లో భాగంగా ఆయనకు కోలనోస్కోపీ (పెద్దపేగు, పురీషనాళంలో మార్పుల్ని గుర్తించే పరీక్ష) చేస్తుండటంతో ఇలా చేస్తున్నట్టు శ్వేతసౌధం తెలిపింది. బేతెస్థలోని వాల్టర్‌ రీడ్‌ నేషనల్‌ మిలటరీ మెడికల్‌ సెంటర్‌లో ఆయనకు మత్తుమందు ఇచ్చి ఈ పరీక్ష చేస్తారు. మత్తులో ఉన్నంతసేపు ఆయన అధికారిక బాధ్యతలను ఉపాధ్యక్షురాలికి అప్పగించారు. అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక బైడెన్‌ కోలనోస్కోపీ చేయించుకోవడం ఇదే తొలిసారని శ్వేతసౌధం మీడియా కార్యదర్శి జెన్‌ సాకి చెప్పారు. 79 ఏళ్ల బైడెన్‌ అమెరికా చరిత్రలోనే అతిపెద్ద వయసున్న అధ్యక్షుడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని