Anand Mahindra: ఇది భారత్‌లో పుట్టిన మహమ్మారి.. దీనికి టీకా లేదు..!

ప్రపంచవ్యాప్తంగా అగ్రస్థానంలో ఉన్న సంస్థలను నడిపించడంలో భారత సంతతి వ్యక్తులు దూసుకెళ్తున్నారు. ఆ సంస్థలకు పగ్గాలు చేపట్టి, అంతర్జాతీయంగా కీర్తి గడిస్తున్నారు. తాజాగా భారత సంతతి వ్యక్తి పరాగ్ అగర్వాల్ ట్విటర్ సీఈఓగా నియమితులు కావడంతో భారత్‌ టాలెంట్‌ను పలువురు ప్రశంసిస్తున్నారు.

Published : 01 Dec 2021 01:34 IST

ట్విటర్ సీఈఓగా పరాగ్ ఎంపికపై మహీంద్రా పోస్టు

ముంబయి: ప్రపంచవ్యాప్తంగా అగ్రస్థానంలో ఉన్న సంస్థలను నడిపించడంలో భారత సంతతి వ్యక్తులు దూసుకెళ్తున్నారు. ఆ సంస్థలకు పగ్గాలు చేపట్టి, అంతర్జాతీయంగా కీర్తి గడిస్తున్నారు. తాజాగా భారత సంతతి వ్యక్తి పరాగ్ అగర్వాల్ ట్విటర్ సీఈఓగా నియమితులు కావడంతో భారత్‌ టాలెంట్‌ను పలువురు ప్రశంసిస్తున్నారు. పరాగ్ నియామకంపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఆనందం వ్యక్తం చేయడంతో పాటు కరోనాతో పోల్చి, తనదైన శైలిలో స్పందించారు. 

‘ఈ మహమ్మారి భారత్‌లో ఉద్భవించిందని చెప్పడం మాకు చాలా ఆనందాన్నిస్తుంది. గర్వంగా కూడా ఉంది. ఇది భారతీయ సీఈఓ వైరస్(ఇండియన్ సీఈఓ వైరస్).. దీనికి టీకా లేదు’ అంటూ మహీంద్రా అభివర్ణించారు. అంతకుముందు పాట్రిక్ కొలిసన్ చేసిన ట్వీట్‌కు పై విధంగా వ్యాఖ్యను జోడించారు. ‘గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్, ఐబీఎం, పాలోఆల్టో నెట్‌వర్క్స్‌, ఇప్పుడు ట్విటర్.. ఈ సంస్థలు భారత్‌ నుంచి వచ్చిన సీఈఓల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. భారత్‌ నుంచి వ్యక్తులు టెక్ ప్రపంచంలో రాణించడం ఆనందంగా ఉంది. అలాగే వలసదారులకు అమెరికా కల్పిస్తున్న అవకాశాలకు ఇది నిదర్శనం’ అని కొలిసన్ ట్వీట్ చేశారు.

ట్విటర్‌ సహ వ్యవస్థాపకుడు జాక్‌ డోర్సే సోమవారం ఆ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో.. భారత సంతతికి చెందిన పరాగ్‌ అగర్వాల్‌ ఆ స్థానంలో నియమితులయ్యారు. ఇప్పటిదాకా ఆయన ట్విటర్‌కు చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌(సీటీఓ)గా ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని