Mimi Chakraborty: మీ ప్రాంతంలో అన్ని సమస్యలుంటే.. ఫొటోల కోసం బాధపడుతున్నారా..?
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, పశ్చిమ్ బెంగాల్ నటి మిమి చక్రవర్తి(Mimi Chakraborty) ఇప్పుడు తీవ్ర విచారంలో ఉన్నారు. ఆమెకు గట్టిగా ఏడ్వాలనిపిస్తోంది. ఆమె ఇంతో ఇష్టపడి దాచుకున్న 7 వేల ఫొటోలు, 500 వీడియోలు ఫోన్ నుంచి డిలీట్ అవ్వడమే అందుకు కారణం.
ఏడువేల ఫొటోలు డిలీట్ అయ్యాయని ఎంపీ ట్వీట్
నెట్టింట్లో మిశ్రమ స్పందన
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, పశ్చిమ్ బెంగాల్ నటి మిమి చక్రవర్తి(Mimi Chakraborty) ఇప్పుడు తీవ్ర విచారంలో ఉన్నారు. ఆమెకు గట్టిగా ఏడ్వాలనిపిస్తోంది. ఆమె ఇంతో ఇష్టపడి దాచుకున్న 7 వేల ఫొటోలు, 500 వీడియోలు ఫోన్ నుంచి డిలీట్ అవ్వడమే అందుకు కారణం. వాటిని తిరిగి పొందేందుకు ఆమె చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో నెట్టింట్లో ఈ విషయాన్ని వెల్లడించారు. తాను వాడుతోన్న యాపిల్ ఫోన్ సంస్థకు ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఆమె మార్కెట్లోకి రెండు నెలల క్రితం విడుదలైన ఐఫోన్ 13ను వాడుతున్నట్లు తెలుస్తోంది.
కాగా, ఆమె ట్వీట్‌కు నెట్టింట్లో మిశ్రమ స్పందన వెల్లడైంది. కొందరు వాటిని ఎలా తిరిగి పొందొచ్చో సూచించారు. మరికొందరు మాత్రం ఎంపీగా బాధ్యతలు మరిచి, ఫొటోలు కోసం బాధపడుతున్నారంటూ విమర్శలు చేస్తున్నారు. ‘ఎంతో మంది చిన్నారులు పాఠశాల చదువుకు దూరం అవుతున్నారు. అనేకమంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఆకలితో అలమటిస్తున్నారు. కానీ ఎంపీ మేడమ్ మాత్రం డిలీట్ అయిన ఫొటోలు, వీడియోల కోసం బాధపడుతున్నారు’ అంటూ ఓ నెటిజన్ తీవ్రంగా స్పందించారు.నియోజవర్గ ప్రజలకు కాస్త సమయం కేటాయించే అవకాశం ఉందనుకుంటున్నానని మరొకరు ఘాటుగా వ్యాఖ్యానించారు.
మిమి చక్రవర్తి జాదవ్‌పూర్ నియోజకవర్గ ఎంపీ. బెంగాల్లో పేరు పొందిన నటి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్‌ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్‌లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్‌కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్‌కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్‌లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం