New Zealand MP: పురిటినొప్పులు వస్తున్నా సైకిల్‌ నడుపుకుంటూ ఆసుపత్రికి.. ఎంపీ సాహసం

నిండి గర్భిణిగా ఉన్న న్యూజిలాండ్‌కు చెందిన ఎంపీ సాహసమే చేశారు. పురుటి నొప్పులు వస్తున్నా.. సైకిల్​ మీదే ఒంటరిగా ఆసుపత్రికి వెళ్లి పండంటి బిడ్డకు జన్మనిచ్చారు.....

Published : 28 Nov 2021 23:55 IST

వెల్లింగ్టన్‌: గర్భిణీలు కాసేపు నడిచేందుకే తంటాలు పడుతుంటారు. ఏమౌతుందోనని భయపడిపోతుంటారు. కానీ నిండి గర్భిణిగా ఉన్న న్యూజిలాండ్‌కు చెందిన ఎంపీ సాహసమే చేశారు. పురిటి నొప్పులు వస్తున్నా.. సైకిల్​ మీదే ఒంటరిగా ఆసుపత్రికి వెళ్లి పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. శనివారం అర్ధరాత్రి 2 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) గ్రీన్స్​ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యురాలు జూలీ అన్నే గెంటర్​కు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో ఆమె సైకిల్​ మీదే ఆసుపత్రికి బయలుదేరారు. 10 నిమిషాల్లో ఆసుపత్రికి చేరిన జూలీ​.. గంట తర్వాత పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె​ సోషల్​ మీడియా వేదికగా వెల్లడించారు.

‘బిగ్​ న్యూస్​! ఈరోజు తెల్లవారుజామున 3.04 గంటలకు మేము మా కుటుంబంలోకి ఓ కొత్త వ్యక్తిని ఆహ్వానించాము. బేబీ ఆరోగ్యంగా ఉంది. నిజానికి పురిటి నొప్పులు వస్తున్న సమయంలో సైకిల్​ తొక్కాలని నేను అనుకుకోలేదు. కానీ అలా జరిగిపోయింది. ఆసుపత్రికి బయలుదేరే సమయానికి నాకు పురుటి నొప్పులు అంత తీవ్రంగా లేవు. కానీ ఆసుపత్రికి చేరే సమయానికి ఎక్కువయ్యాయి’ అంటూ ఫేస్‌బుక్‌ వేదికగా ఎంపీ వెల్లడించారు. 2018లో తన మొదటి కాన్పునకు కూడా గెంటర్​ ఇలాగే సైకిల్​ మీద ఆసుపత్రికి వెళ్లడం విశేషం.

 

Read latest National - International News and Telugu News


 

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని