Published : 02/12/2021 01:27 IST

omicron: నైజీరియాలో అక్టోబర్‌లోనే ఒమిక్రాన్‌ కేసులు!

అబూజ: కరోనా కొత్త వేరియంట్​ ఒమిక్రాన్‌పై దక్షిణాఫ్రికా నవంబర్​ 24న ప్రపంచానికి సమాచారం అందించింది. అయితే, గత అక్టోబర్​లోనే ఈ వైరస్​ వ్యాప్తి మొదలైనట్లు తాజాగా వెల్లడైంది. ఒమిక్రాన్​ను దక్షిణాఫ్రికా గుర్తించేందుకు కొన్ని వారాల ముందే.. తాము సేకరించిన నమూనాలో ఈ వేరియంట్‌​ నిర్ధరణ అయినట్లు నైజీరియా తాజాగా ప్రకటించింది. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వారి నమూనాలు సేకరించి పరీక్షించగా ఈ వేరియంట్‌​ నిర్ధరణ అయినట్లు నైజీరియా ప్రజారోగ్య సంస్థ (సీడీసీ) బుధవారం వెల్లడించింది. మొత్తంగా ఇద్దరికి ఈ వైరస్ నిర్ధరణ అయిందని తెలిపింది.

తాము ఒమిక్రాన్‌ను ముందే గుర్తించినట్లు నెదర్లాండ్స్‌ సైతం మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. కొత్త వేరియంట్​పై ప్రపంచ ఆరోగ్య సంస్థను దక్షిణాఫ్రికా హెచ్చరించకముందే.. తమ దేశంలో ఒమిక్రాన్​ వ్యాపించి ఉంటుందని నెదర్లాండ్స్​ వెల్లడించింది. నవంబర్​ 24న కొత్త వేరియంట్​ గురించి డబ్ల్యూహెచ్​ఓకు దక్షిణాఫ్రికా చెప్పిందని.. అయితే తమ దేశంలో 19 నుంచి 23 మధ్య తీసిన నమూనాల్లో ఒమిక్రాన్​ను గుర్తించినట్టు నెదర్లాండ్స్​ ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.

గల్ఫ్‌ దేశాల్లో తొలి కేసు

ఒమిక్రాన్​ తొలి కేసును గుర్తించినట్లు సౌదీ అరేబియా తాజాగా వెల్లడించింది. ఉత్తర ఆఫ్రికా దేశం నుంచి వచ్చిన వ్యక్తిలో వైరస్​ నిర్ధరణ అయినట్లు ఆ దేశ అధికారిక మీడియా తెలిపింది. వైరస్​ సోకిన వ్యక్తితో పాటు ఆయన సన్నిహితులను క్వారంటైన్​కు తరలించినట్లు పేర్కొంది. దీంతో గల్ఫ్​ దేశాల్లో తొలి ఒమిక్రాన్​ కేసు నమోదైనట్లయింది. ఇప్పటి వరకు సుమారు 20 దేశాల్లో ఒమిక్రాన్​ వేరియంట్​ను గుర్తించారు.

 

Read latest National - International News and Telugu News

 

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని