Param Bir Singh: పరంబీర్​ సింగ్​పై నాన్​ బెయిలబుల్​ వారెంట్​ రద్దు

బలవంతపు వసూళ్లకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ముంబయి మాజీ పోలీసు కమిషనర్‌ పరమ్‌బీర్​‌ సింగ్‌పై జారీ చేసిన నాన్​ బెయిలబుల్​ వారెంట్​ను మహారాష్ట్ర ఠాణే కోర్టు రద్దు చేసింది.....

Published : 26 Nov 2021 22:26 IST

ముంబయి: బలవంతపు వసూళ్లకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ముంబయి మాజీ పోలీసు కమిషనర్‌ పరమ్‌బీర్​‌ సింగ్‌పై జారీ చేసిన నాన్​ బెయిలబుల్​ వారెంట్​ను మహారాష్ట్ర ఠాణే కోర్టు రద్దు చేసింది. విచారణ కోసం కోర్టు ఎదుట పరమ్​బీర్​ హాజరుకావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దర్యాప్తులో భాగంగా అధికారులకు సహకరించాలని.. ఎప్పుడు పిలిస్తే అప్పుడు హాజరుకావాలని ఆదేశించింది. రూ. 15వేల వ్యక్తిగత బాండు సమర్పించాలని స్పష్టం చేసింది.

బలవంతపు వసూళ్ల కేసులో కొంతకాలంగా పరారీలో ఉన్న పరమ్‌బీర్​‌ సింగ్‌ గురువారం ముంబయిలో ప్రత్యక్షమయ్యారు. కోర్టు ఆదేశాల మేరకు కేసు దర్యాప్తునకు సహకరించేందుకుగాను చండీగఢ్‌ నుంచి ఆయన ముంబయికి వచ్చినట్లు పోలీసు అధికారులు పేర్కొన్నారు. పరమ్‌బీర్‌ సింగ్‌ విమానాశ్రయం నుంచి నేరుగా నేర విభాగం కార్యాలయానికి వెళ్లగా.. గోరెగావ్‌ ఠాణాలో ఆయనపై నమోదైన బలవంతపు వసూళ్ల కేసులో అధికారులు వాంగ్మూలం తీసుకున్నారు.

రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ నివాసం ముందు పేలుడు పదార్థాలతో కూడిన ఎస్​యూవీ నిలిపివేత, వ్యాపారవేత్త మన్‌సుఖ్​ హిరేన్‌ హత్య కేసులో మాజీ పోలీసు అధికారి సచిన్ వాజే అరెస్టయ్యారు. ఆ తర్వాత ముంబయి పోలీసు కమిషనర్‌గా ఉన్న పరమ్‌బీర్‌ సింగ్‌ను మహారాష్ట్ర సర్కార్‌ బదిలీ చేసింది. అప్పటి నుంచి ఆయన అదృశ్యమయ్యారు. ఈ ఏడాది మే తర్వాత ఒక్కసారి కూడా కార్యాలయానికి వెళ్లలేదు.

Read latest National - International News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని