Pinarayi Vijayan: టీకా తీసుకోకపోతే ఉచిత వైద్యం అందించం: కేరళ సీఎం

కరోనా టీకాలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తూ.. ప్రభుత్వానికి సహకరించని వారికి ఉచిత వైద్యం అందించబోమని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ స్పష్టం చేశారు......

Published : 01 Dec 2021 01:48 IST

తిరువనంతపురం: కరోనా టీకాలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తూ.. ప్రభుత్వానికి సహకరించని వారికి ఉచిత వైద్యం అందించబోమని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ స్పష్టం చేశారు. వ్యాక్సిన్‌ తీసుకోనివారికి ఇకపై కొవిడ్‌ పాజిటివ్‌గా తేలితే వారి వైద్య ఖర్చులను ప్రభుత్వం భరించబోదని వెల్లడించారు. ఆరోగ్య పరిస్థితి లేదా ఎలర్జీ కారణంగా వ్యాక్సిన్ తీసుకోలేని వారు.. ఈ విషయాన్ని నిర్ధరించేలా ప్రభుత్వ వైద్యుల వద్ద ధ్రువీకరణ పత్రాన్ని తీసుకొని ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

‘ఎలర్జీ లేదా ఆరోగ్య సమస్యల కారణంగా టీకాలు వేసుకోని ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది ప్రభుత్వ వైద్యుల నుంచి తీసుకున్న ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి. ఇతరులు ఏడు రోజులకు ఒకసారి ఆర్టీపీసీఆర్‌ నెగటివ్ సర్టిఫికేట్‌ను సమర్పించాలి. ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలకు అయ్యే ఖర్చును కూడా వారే భరించాలి’ అని పినరయి విజయన్‌ వెల్లడించారు. పాఠశాలలు, కళాశాలల్లోని విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కార్యాలయాల్లో పనిచేసేవారు, ప్రజలతో సంభాషించే వారికి కూడా ఇదే నిబంధన వర్తిస్తుందని తెలిపారు. ఒమిక్రాన్‌ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో జాగ్రత్తలు పటిష్టం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. విదేశాల నుంచి వచ్చే వారి ట్రావెల్ హిస్టరీని క్షుణ్ణంగా పరిశీలించాలని, ప్రొటోకాల్‌ను కచ్చితంగా పాటించాలని సూచించారు.

 

Read latest National - International News and Telugu News

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని