Corona Virus: ఇతర కరోనా వైరస్‌లు సోకినా కొవిడ్‌ నుంచి రక్షణ

ప్రస్తుత కొవిడ్‌-19 కారక సార్స్‌-కోవ్‌-2 వైరస్‌ కాకుండా మానవులకు కొన్ని ఇతర కరోనా వైరస్‌లూ సోకుతుంటాయి. వాటివల్ల హాని ఉండదు. అవి సోకడం వల్ల సాధారణ జలుబు మాత్రమే కలుగుతుంది. వీటికి గురికావడం వల్ల కూడా కొవిడ్‌ నుంచి

Updated : 24 Nov 2021 09:08 IST

లండన్‌: ప్రస్తుత కొవిడ్‌-19 కారక సార్స్‌-కోవ్‌-2 వైరస్‌ కాకుండా మానవులకు కొన్ని ఇతర కరోనా వైరస్‌లూ సోకుతుంటాయి. వాటివల్ల హాని ఉండదు. అవి సోకడం వల్ల సాధారణ జలుబు మాత్రమే కలుగుతుంది. వీటికి గురికావడం వల్ల కూడా కొవిడ్‌ నుంచి కొంత మేర రక్షణ లభిస్తుందని తాజా పరిశోధన తేల్చింది. స్విట్జర్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ జ్యూరిచ్‌ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. హాని కలిగించని ఇలాంటి కరోనా వైరస్‌ల నుంచి రక్షణ కల్పించే యాంటీబాడీలు కలిగి ఉన్నవారు తీవ్రస్థాయి కొవిడ్‌ బారినపడే అవకాశం తక్కువేనని పరిశోధనకు నాయకత్వం వహించిన అలెగ్జాండ్రా ట్రోకలా చెప్పారు. అలాంటివారికి కొవిడ్‌ సోకినా ఆసుపత్రిపాలు కావడం అరుదని పేర్కొన్నారు. ఇలాంటి రోగ నిరోధక స్పందనను ‘క్రాస్‌ రియాక్టివిటీ’గా పేర్కొంటారు. టి కణ స్పందన విషయంలోనూ ఇది జరుగుతుందని వివరించారు. ఇన్‌ఫెక్షన్ల నుంచి ఇది అదనపు రక్షణ కవచంలా పనిచేస్తుందన్నారు.

ఇన్‌ఫెక్షన్‌ నుంచి కోలుకున్న వెంటనే లేదా సమర్థ టీకా పొందిన తర్వాత మాత్రమే సార్స్‌-కోవ్‌-2 నుంచి ప్రజలకు పూర్తి స్థాయి రక్షణ లభిస్తుంది. ఆ సమయంలో సంబంధిత వైరస్‌ను అడ్డుకునే యాంటీబాడీలు గరిష్ఠ స్థాయిలో ఉంటాయి. ఇవి పడిపోయే కొద్దీ ఇన్‌ఫెక్షన్‌ నుంచి రక్షణ తగ్గిపోతుంది. అయితే రోగ నిరోధక వ్యవస్థకు జ్ఞాపకశక్తి ఉంటుంది. మళ్లీ సంబంధిత వైరస్‌ తారసపడితే అది క్రియాశీలమై, యంటీబాడీలు, టి కణ రక్షణను ప్రేరేపిస్తుంది. అయితే క్రాస్‌ రియాక్టివ్‌ స్పందన కన్నా జ్ఞాపకశక్తి స్పందన చాలా మెరుగైందని శాస్త్రవేత్తలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు