Amarinder Singh: సిద్ధూని సీఎం కానివ్వను!: అమరీందర్‌ సింగ్‌

పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడు నవ్‌జ్యోత్‌ సింగ్‌ సిద్ధూ ‘ప్రమాదకారి’ అంటూ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ బుధవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Updated : 23 Sep 2021 06:47 IST

చండీగఢ్‌: పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడు నవ్‌జ్యోత్‌ సింగ్‌ సిద్ధూ ‘ప్రమాదకారి’ అంటూ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ బుధవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంకలను అనుభవం లేని నేతలుగా వ్యాఖ్యానించారు. పంజాబ్‌ సీఎంగా పనిచేసిన అమరీందర్‌ ఇటీవల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పలు ముఖాముఖి కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధూపై గట్టి అభ్యర్థిని నిలబెడతానని ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సిద్ధూని ముఖ్యమంత్రిని కానివ్వకుండా పోరాడతానన్నారు. ‘‘అతనో ‘డ్రామా మాస్టర్‌’. కొత్త ముఖ్యమంత్రితో తానే ఓ ‘సూపర్‌ సీఎం’ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇలాంటి ప్రమాదకర వ్యక్తి నుంచి దేశాన్ని కాపాడేందుకు ఎలాంటి త్యాగానికైనా సిద్ధమే’’ అని సిద్ధూని ఉద్దేశించి అమరీందర్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని