Rahul Gandhi: ఏ బిడ్డకూ అలా జరక్కూడదు: రాహుల్‌ గాంధీ

మాదకద్రవ్యాల కేసులో ఆర్యన్‌ ఖాన్‌ (23) జైలుపాలైన తర్వాత షారుక్‌ ఖాన్‌కు మద్దతుగా నిలిచిన వారిలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ కూడా ఉన్నారు. ఈ మేరకు రాహుల్‌ గత నెల 14న షారుక్‌కు లేఖ రాసిన విషయం

Updated : 04 Nov 2021 07:41 IST

షారుక్‌కు రాసిన లేఖలో కాంగ్రెస్‌ అగ్రనేత

దిల్లీ: మాదకద్రవ్యాల కేసులో ఆర్యన్‌ ఖాన్‌ (23) జైలుపాలైన తర్వాత షారుక్‌ ఖాన్‌కు మద్దతుగా నిలిచిన వారిలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ కూడా ఉన్నారు. ఈ మేరకు రాహుల్‌ గత నెల 14న షారుక్‌కు లేఖ రాసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ‘‘మీకు వచ్చిన కష్టాలను చూసి చాలా విచారించాను. ఏ బిడ్డకూ ఇలా జరగకూడదు’’ అని షారుక్‌, గౌరీ దంపతులకు రాసిన లేఖలో రాహుల్‌ పేర్కొన్నారు. ‘‘ప్రజల కోసం మీరు చేసిన మంచి పనులను నేను చూశాను. వారి ఆశీస్సులు, ఆకాంక్షలు మీతోటే ఉంటాయన్న నమ్మకం ఉంది’’ అని తెలిపారు. కుమారుడి అరెస్టు కారణంగా తీవ్ర ఒత్తిడిలో ఉన్న షారుక్‌ ఖాన్‌కు బాలీవుడ్‌ ప్రముఖులతోపాటు, మహారాష్ట్రలోని అధికార శివసేన, ఎన్‌సీపీలు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని