Lakhimpur Case: మంత్రి పదవి నుంచి తప్పించకుంటే ఆందోళన తీవ్రతరం: టికాయిత్‌

లఖింపుర్‌ ఖేరి హింసాత్మక ఘటనపై కొనసాగుతోన్న దర్యాప్తుపై భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేశ్‌ టికాయిత్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Updated : 27 Feb 2024 19:44 IST

దర్యాప్తు తీరుపై రాకేశ్‌ టికాయిత్‌ అసంతృప్తి

దిల్లీ: లఖింపుర్‌ ఖేరి హింసాత్మక ఘటనపై కొనసాగుతోన్న దర్యాప్తుపై భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేశ్‌ టికాయిత్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి కుమారుడికి ‘ఎర్ర తివాచీ’ వేస్తున్న తీరు తమకు మరింత ఆగ్రహాన్ని తెప్పిస్తుందన్నారు. అజయ్‌ మిశ్రాను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేసిన ఆయన.. నిందితుడి తండ్రి అదే పదవిలో కొనసాగితే దర్యాప్తు సరిగా జరగదనే విషయం యావత్‌ ప్రపంచానికి అర్థమవుతోందని అన్నారు.

లఖింపుర్‌ కేసులో దర్యాప్తు బృందాన్ని కేంద్ర మంత్రి ప్రభావితం చేస్తున్నారని బీకేయూ నేత రాకేశ్‌ టికాయిత్‌ ఆరోపించారు. మంత్రి పదవి నుంచి అజయ్‌ మిశ్రాను తొలగించకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇందులో భాగంగా అక్టోబర్‌ 18న ఆరు గంటలపాటు రైల్‌ రోకో చేపడుతామని ప్రకటించారు. అంతేకాకుండా అక్టోబర్‌ 26న లఖ్‌నవూలో బీకేయూ ఆధ్వర్యంలో మహాపంచాయత్‌ నిర్వహిస్తామని టికాయిత్‌ పేర్కొన్నారు.

ఆశిష్ మిశ్రాతో సీన్‌ రీక్రియేషన్‌..

లఖింపుర్‌ ఖేరి ఘటన దర్యాప్తును పోలీసు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) వేగవంతం చేసింది. ఇప్పటికే జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్‌ మిశ్రాను మూడు రోజుల పాటు కస్టడీకి తీసుకొని విచారిస్తోంది. ఇందులో భాగంగా  తాజాగా ఆశిష్‌తోపాటు ఈ కేసులో అరెస్టైన మరో ముగ్గురిని సీన్‌ రీక్రియేషన్‌లో భాగంగా ఘటనా స్థలానికి పోలీసులు తీసుకెళ్లారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని